Pushpa shoot : హైదరాబాద్ లో ల్యాండ్ అయిన పుష్ప, షూట్ షురూ అయినట్టే…!

పుష్ప (Pushpa) సినిమాతో పాన్ ఇండియా (Pan India) స్టార్ గా మారిపోయిన ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 (Pushpa 2) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 29, 2024 | 12:00 PMLast Updated on: Jul 29, 2024 | 1:05 PM

Pushpa Landed In Hyderabad Just As The Shoot Started

 

 

 

పుష్ప (Pushpa) సినిమాతో పాన్ ఇండియా (Pan India) స్టార్ గా మారిపోయిన ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 (Pushpa 2) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప 1 కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ఇప్పుడు రెండో భాగం విషయంలో అల్లు వారి అబ్బాయి సీరియస్ గా ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఎన్నో కామెంట్స్ మనం చూసాం. సినిమా ఆలస్యం కావడంతో దర్శకుడు సుకుమార్ పై అల్లు అర్జున్ కోపంగా ఉన్నాడనే వార్తలు కూడా చూసాం. గడ్డం కూడా తీయించాడు అని మరో డూప్ తో సినిమాను పూర్తి చేస్తున్నారని అన్నారు.

కాని దానిపై ఏ విధమైన అధికారిక ప్రకటన రాలేదు. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు యూరప్ ట్రిప్ లో ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ఉండవచ్చు అనే దానిపై క్లారిటీ రాలేదు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్ వచ్చేయడంతో సినిమా షూటింగ్ పై మరోసారి వార్తలు వస్తున్నాయి. వచ్చే వారం నుంచి పుష్ప రెండో భాగం షూటింగ్ షురూ అవుతుందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. కొత్త షెడ్యూల్ మొత్తం కూడా క్లైమాక్స్ సన్నివేశాలపైనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

డైరెక్టర్ తో గొడవ పడి అల్లు అర్జున్ వెళ్ళాడని కామెంట్స్ వచ్చినా… కొన్ని ఎడిటింగ్ వర్క్స్ ఉండటంతో సినిమా షూటింగ్ వాయిదా వేసారట. ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సినిమాలో చిన్న చిన్న సూచనలు చేయడంతో క్లైమాక్స్ లో వాటిని చేర్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉండటంతో సినిమాను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు భారీగా ఖర్చు చేసేందుకు సిద్దమవుతున్నారని టాక్. ఇక అమెజాన్ ప్రైమ్ కూడా ఈ సినిమాపై భారీగా మరోసారి ఖర్చు పెట్టేందుకు సిద్దమైంది. ఇక రెండో భాగంలో ఐటెం సాంగ్ ఉంటుందా ఉండదా అనే దానిపై క్లారిటీ లేదు గాని దీనికి సంబంధించి ఒక బాలీవుడ్ హీరోయిన్ తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది.