దేవర అడ్డాలో పుష్ప మిస్ ఫైర్, కొంప ముంచిన కాన్ఫిడెన్స్

పుష్ప 2 సినిమాపై హోప్స్ ఇప్పుడు ఫ్యాన్స్ లో పీక్స్ లో ఉన్నాయి. సినిమా అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుంది, కల్కి, దేవర, ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనే దానిపై ఫ్యాన్స్ లో చాలా హోప్స్ ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2024 | 06:40 PMLast Updated on: Oct 26, 2024 | 6:40 PM

Pushpa Misfires Horn Dipped Confidence

పుష్ప 2 సినిమాపై హోప్స్ ఇప్పుడు ఫ్యాన్స్ లో పీక్స్ లో ఉన్నాయి. సినిమా అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుంది, కల్కి, దేవర, ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనే దానిపై ఫ్యాన్స్ లో చాలా హోప్స్ ఉన్నాయి. పుష్ప 2 కచ్చితంగా సూపర్ హిట్ అని, 3 కోసం ఎదురు చూద్దాం అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుంది, ఫాహాద్ ఫాజిల్ తో యాక్షన్ సీన్స్ ఎలా ప్లాన్ చేసారు అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా బన్నీని కచ్చితంగా ట్రోల్ చేయడం ఖాయం.

అయితే ఇప్పుడు కన్నడ మార్కెట్ విషయంలో పుష్పకు భయం మొదలయింది. ఇక్కడ దేవర సినిమా పీక్స్ లో వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే. గతంలో కన్నడలో తెలుగు సినిమాలు చాలా రిలీజ్ అయినా దేవర రేంజ్ లో మాత్రం ఆడలేదు. ఇక్కడ బ్లాక్ మార్కెట్ లో దేవర టికెట్ 3 వేలు కూడా పలకడం చూసి కన్నడ హీరోలు కూడా షాక్ అయ్యారు. ప్రీ బుకింగ్ మార్కెట్ కూడా ఇక్కడ ఓ రేంజ్ లో జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు, బళ్ళారి సహా పలు ప్రాంతాల్లో చాలా మంచి మార్కెట్ చూసాం.

కాని పుష్ప విషయంలో ఇది డిఫరెంట్ గా ఉండే ఛాన్స్ ఉంది. కన్నడ మార్కెట్ విషయంలో ఓ కామెంట్ పుష్పను ఇబ్బంది పెట్టే ఛాన్స్ కనపడుతోంది. గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుతూ ఒక కామెంట్ చేసారు. కెజిఎఫ్, కాంతార రికార్డులు బద్దలయ్యే స్థాయిలో రిలీజ్ ఇస్తామని, ఎక్కువ షోలు వేసుకుని మరిచిపోలేని మైలురాళ్ళు సాధిస్తామని చెప్పడంతో అక్కడి జనాలు షాక్ అయ్యారు. కేజిఎఫ్, కాంతారా సినిమాలు కన్నడ సినిమా రేంజ్ పెంచితే… వాటి స్థాయిని తగ్గిస్తామని ఎలా చెప్తారు అంటూ మండిపడుతున్నారు.

కన్నడలో మన సినిమాల డామినేషన్ పెరిగింది. అప్పట్లో ఇలాంటి డామినేషన్ ఉంటేనే తెలుగు సినిమాలను బ్యాన్ చేసారు కర్ణాటక. దివంగత కన్నడ సినీ దిగ్గజం రాజ్ కుమార్ నేతృత్వంలో ఈ ఉద్యమం జరిగింది. ఆయన మరణం తర్వాత మళ్ళీ నిషేధం ఎత్తేసారు. బన్నీకి తెలుగు రాష్ట్రాల తర్వాత కర్ణాటకలోనే కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ న్యూస్ సినిమాను ఇబ్బంది పెడుతోంది. తెలుగు సినిమాలను మళ్ళీ బ్యాన్ చేసే ఛాన్స్ లేదు గాని… లోకల్ ఫీలింగ్ ఎక్కువ కన్నడలో. అదేమైనా జరిగితే మాత్రం కచ్చితంగా ఇబ్బంది పడవచ్చు.