పుష్ప ది రూల్ రివ్యూ: RIP బాక్సాఫీస్, ఊర మాస్ బ్లాక్ బస్టర్

వేల సినిమాలు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సినిమాలు థియేటర్లలో ఆడాయి. వందల కోట్ల మంది ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో సినిమాలు చూసారు. కాని వరల్డ్ సినిమాలో “పుష్ప ది రూల్” రేంజ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ కాలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2024 | 12:59 AMLast Updated on: Dec 05, 2024 | 12:59 AM

Pushpa The Rule Review

వేల సినిమాలు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సినిమాలు థియేటర్లలో ఆడాయి. వందల కోట్ల మంది ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో సినిమాలు చూసారు. కాని వరల్డ్ సినిమాలో “పుష్ప ది రూల్” రేంజ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ కాలేదు. హాలీవుడ్, బాలీవుడ్ జాన్తా నై… ఓన్లీ పుష్ప. పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అనే విషయాన్ని సినిమా రిలీజ్ తోనే తోడ కొట్టి చెప్పాడు భాయ్. మరి అసలు సినిమా ఎలా ఉంది…? విడుదలకు ఒక రోజు ముందే బెనిఫిట్ షోస్ స్టార్ట్ చేసిన పుష్ప… బాక్సాఫీస్ ను రూల్ చేస్తుందా…? అసలు సినిమా ఓవరాల్ రివ్యూ ఏంటీ…?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా… క్రేజీ డైరెక్టర్, లెక్కల మాస్టారూ సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీస్ బ్యానర్ పై వచ్చిన పుష్ప పార్ట్ 1 కు కంటిన్యూగా పుష్ప 2ను రిలీజ్ చేసారు. మూడేళ్ళ నుంచి షూట్ జరుపుకున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు, ఎన్నో లెక్కలు, కోట్లాది మంది అభిమానులకు ఏదో తెలియని ఎమోషన్ ఈ సినిమా. క్రికెటర్లు, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఇలా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఊహకు కూడా అందని అంచనాలతో రిలీజ్ అయింది పుష్ప ది రూల్.

సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే… ఒక్క మాటలో చెప్పాలంటే సెకండ్ హాఫ్ తో పని లేకుండా ఫస్ట్ హాఫ్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ కొట్టేసాడు ఐకాన్ స్టార్. సినిమాలో ఎలివేషన్ సీన్స్ చూస్తున్న ఆడియన్స్ కు పూనకాలు వస్తున్నాయి థియేటర్లో. ఎంట్రీ సీన్ అయితే ది బెస్ట్… ఆ ఒక్క సీన్ తోనే సినిమా ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ ఇచ్చాడు సుక్కు. అల్లు అర్జున్ అయితే సినిమా కోసం ప్రాణం పెట్టేసాడు. బన్నీ కెరీర్ లోనే ది బెస్ట్ యాక్షన్ సీన్స్ పుష్పలో చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ లో… పోలీస్ స్టేషన్ సీన్, క్యాంప్ ఆఫీస్ సీన్, ఫాహాద్ ఫాజిల్ ఎంట్రీ సినిమాను వేరే లెవెల్ కు తీసుకు వెళ్ళాయి.

శ్రీవల్లి ఎంట్రీ, షెకావత్ మారు వేశం ఎంట్రీ.. పుష్పా పుష్పా సాంగ్ ఇలా అన్నీ సినిమాను వేరే లెవెల్ లో నడిపించాయి. సీఎంతో ఫోటో దిగమని శ్రీవల్లి చెప్పే సీన్.. ఫోటో అడిగితే ఇవ్వని సీఎం.. నేను ఫోటో దిగినోడే నెక్ట్స్ సీఎం అవుతాడు అని పుష్ప చెప్పే డైలాగ్ పూనకాలు తెప్పించింది. అనసూయ ఎంట్రీ, షెకావత్ పుష్ప ఫేస్ ఆఫ్ సీన్లు హైలెట్. ఇక ఇగో మీద నడిచే ఈ సీన్లు సినిమా రేంజ్ ను పెంచేసాయని చెప్పాలి. ఫస్ట్ హాఫ్‌ కి పుష్ప సారీ చెప్పే సీన్.. అక్కడ బన్నీ చేసే యాక్షన్‌కి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఫుల్లుగా తాగేసి ఉండే పుష్ప.. సారీ ఎలా చెబుతాడు? అసలు చెబుతాడా? చెబితే.. తరువాత ఏం చేస్తాడు అనేది హైలెట్ అయింది.

ఇక రష్మిక అయితే సినిమా కోసం జీవించింది. “ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఆడికి ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అనే డైలాగ్ తో ఒక్కసారిగా థియేటర్ షాక్ అయింది. సినిమాలో జాతర సీన్ సినిమాను డామినేట్ చేసేసింది. ఆ ఒక్క సీన్ కోసం కోట్ల టికెట్ లు తెగుతాయనేది బెనిఫిట్ షో తో క్లారిటీ వచ్చేసింది. ఫాహాద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్య సీన్స్ అయితే వేరే లెవెల్. సినిమాకు ఫాఫాను ఎందుకు సుక్కు సెలెక్ట్ చేసాడో పుష్ప ది రూల్ లో అతని యాక్షన్ సీన్స్ చూస్తే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు సుక్కు ఇచ్చిన హైప్… దానికి ఫాఫా యాక్టింగ్ సినిమాలో వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ కాస్త లాగ్ అనిపించినా ఎలివేషన్ సీన్స్ తో ఆ ఫీల్ ఎక్కడా కనపడలేదు.

సెకండ్ ఆఫ్ లో జాతర సీన్ చూసిన అభిమానులు ఆ మేనియాలో ఉండిపోయారు. ఆ సీన్ లో బన్నీ తాండవం ఆడేసాడు. జాతర సీన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే… ఇండియన్ సినిమాలో ఆ సీన్ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కలలో కూడా రాదూ అనే రేంజ్ లో ఉంది. సుక్కు ఆలోచనను పర్ఫెక్ట్ గా దింపేసాడు అల్లు అర్జున్. జాతర సీన్ కు నేషనల్ అవార్డ్ పక్కా అంటున్నారు ఆడియన్స్. ఇక సినిమాలో ఎమోషన్స్, డ్రామా, యాక్షన్ అన్నీ కూడా పక్కాగా ప్లాన్ చేసి కమర్షియల్ హిట్ కొట్టాడు సుకుమార్. సుకుమార్ డైరెక్షన్ టాలెంట్ చూసి ఆడియన్స్ ఊగిపోయారు.

లెక్కల మాస్టారు పక్కా లెక్కతో ప్లాన్ చేసి కొట్టాడు అని… మూడేళ్ళ వెయిటింగ్ టైం వర్త్ అనడానికి ఒక్క జాతర సీన్ చాలు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఓ యాక్షన్ సీన్, ఓ ఎలివేషన్ సీన్, ఓ ఎమోషనల్ సీన్, ఓ రొమాంటిక్ సీన్ అంటూ ఇలా పకడ్బంధీగా స్క్రీన్ ప్లేతో సినిమాను పక్కాగా ప్లాన్ చేసాడు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు థియేటర్లు బద్దలు కావడం పక్కా. సాంగ్స్ పై కూడా చాలా స్పెషల్ గా ఫోకస్ చేసి కోరియోగ్రఫీ చేసారు. మాస్ ఆడియన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేస్తాయి. ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసింది.

మూడేళ్ళ నుంచి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమా ఫ్యాన్స్ కు పుష్ప ది రూల్ దమ్ము ఏంటో చూపించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఈ పండుగ రోజు కోసం ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తుంటే వైల్డ్ ఫైర్ అంటూ బాక్సాఫీస్ కు నిప్పు పెట్టేసాడు బన్నీ. ప్రీ బుకింగ్స్ లో లక్షల టికెట్ లు అమ్ముడు అవుతుంటే కామెంట్స్ చేసిన వాళ్ళు, సినిమా ట్రైలర్ చూసి వెకిలి నవ్వులు నవ్విన వాళ్లకు పుష్ప స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. నేవార్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో హిట్ కొట్టి చూపించింది పుష్ప. ఇండియన్ సినిమా కాలర్ ఎగరేసే రేంజ్ లో సినిమా ఉందంటూ సినిమా చూసిన వాళ్ళు తొడకొట్టి చెప్తున్నారు. కచ్చితంగా ఒటీటీ కోసం ఎదురు చూడకుండా థియేటర్లో చూడాల్సిన బొమ్మ.

DIAL Rating: 3.5