కల్కీ, ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎర్త్ పెట్టిన పుష్ప, రెండు రోజుల్లో బ్రేక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ సినిమా అతి తక్కువ రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసి పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2024 | 07:31 PMLast Updated on: Dec 12, 2024 | 7:31 PM

Pushpa Who Broke Kalki And Rrr Records Breaks In Two Days

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ సినిమా అతి తక్కువ రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసి పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపుతోంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మన తెలుగు, తమిళం, మలయాళం కంటే హిందీలో ఎక్కువగా ఆదరించారు. అక్కడి అభిమానులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండటంతో ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సినిమాకు భారీ ఆక్యుపెన్సీ రేట్ నమోదయింది.

అందుకే వసూళ్లు కూడా అక్కడే భారీగా వచ్చాయి. మహారాష్ట్రలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1000 రెండు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది అని దీనితో అత్యంత వేగంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా నిలిచిందని వెల్లడించింది. కమర్షియల్ సినిమాకు దర్శకుడు సుకుమార్ కొత్త అర్థం చెప్పారంటూ ఆకాశానికి ఎత్తేసింది.

ఇక పుష్ప 2 సినిమా ఈ ఘనత సాధించిన ఎనిమిదో చిత్రంగా నిలిచింది. భారతదేశ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా దంగల్. ఈ సినిమాకి 2024 కోట్ల వసూళ్లు వచ్చాయి. దీని తర్వాత బాహుబలి 2కు 1742 కోట్లు వచ్చాయి. ఇక రాజమౌళి డైరెక్టర్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో 1250 కోట్లు వసూళ్లు రాగా కేజిఎఫ్ 2 కు 1176 కోట్లు వచ్చాయి. జవాన్ సినిమాకు 1157 కోట్లు రాగా పటాన్ సినిమాకు 1042 కోట్ల వసూళ్లు వచ్చాయి. కల్కి సినిమాకు 1019 కోట్ల వసూళ్లు వచ్చాయి.

ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేయడానికి పుష్ప 2 రెడీ అవుతుంది. కచ్చితంగా బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందనే అంచనాలో నిర్మాతలు ఉన్నారు. సంక్రాంతి వరకు మరో పెద్ద సినిమా లేకపోవడంతో ఈ సినిమా మళ్లీ క్రిస్మస్ తరువాత ఊపు అందుకునే అవకాశం ఉందని అంచనా కూడా వేస్తున్నారు. అయితే మలయాళం, తమిళంలో మాత్రం సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. మన తెలుగులో కూడా కొన్ని చోట్ల సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గుతుంది. ఈ సినిమాలో కథ లేకపోయినా అల్లు అర్జున్ యాక్షన్ కోసం అభిమానులు క్యూకడుతున్నారు. నార్త్ లో అల్లు అర్జున్ లుక్కుకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఏ బాలీవుడ్ హీరో కూడా అల్లు అర్జున్ రేంజ్ లో చేయలేదని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అక్కడి ఫ్యాన్స్.