దేవర2, సలార్ 2, కల్కీ 2 కి… భయపడ్డ 1500 కోట్ల పుష్పరాజ్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, వార్ 2 తర్వాత డ్రాగన్ మూవీతో బిజీ అవుతాడు.. ఆల్రెడీ లాంచైన ప్రాజెక్టే కాబట్టి అందులో ఎలాంటి డౌట్ లేదు. కాని ఆ తర్వాతే దేవర 2తో తను బిజీ అవుతాడనే మాట, ఐకాన్ స్టార్ ని కంగారు పెట్టిస్తోందట.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, వార్ 2 తర్వాత డ్రాగన్ మూవీతో బిజీ అవుతాడు.. ఆల్రెడీ లాంచైన ప్రాజెక్టే కాబట్టి అందులో ఎలాంటి డౌట్ లేదు. కాని ఆ తర్వాతే దేవర 2తో తను బిజీ అవుతాడనే మాట, ఐకాన్ స్టార్ ని కంగారు పెట్టిస్తోందట. అంతేకాదు ప్రభాస్ వచ్చేఏడాది పాత ప్రాజెక్టులైన సలార్, కల్కీ సీక్వెల్స్ ని పరుగులుపెట్టించబోతున్నాడన్న మాట కూడా, బన్నీని ఆలోచనల్లో పడేసినట్టుంది. పుష్ప సీక్వెల్ తో1500 కోట్ల వసూళ్ళు రాబట్టిన ఐకాన్ స్టార్, నెక్ట్స్ అంతకు మించి రిస్క్ చేయాలి. వరుస హిట్లతో దూసుకెళుతున్నాడు కాబట్టి, కొత్త ప్రయోగాలతో దూసుకెళ్లాలి. కాని తను భయపడినట్టున్నాడని అంటున్నారు. ఎవరైనా ఫ్లాప్ పడితే డిలా పడాలి… లేదంటే ఆలోచనలో పడాలి.. అలాంటిది విచిత్రంగా 1500 కోట్ల వసూళ్లు తెచ్చిన పుష్ప 2 తర్వాత కంగారు పడుతున్నాడంటే అర్ధమేంటి? అసలు కొత్త సినిమా అంటే బన్నీ వెనకడుగు వేస్తున్నాడా..? ఎందుకో తెలియని టెన్షన్… అయినా పుష్ప2 తర్వాత కొత్త ప్రాజెక్టుకి సై అని, సడన్ గా వెనకడుగు వేయటానికి రీజనేంటి..? దేవర2, కల్కీ2, సలార్ 2 తో… బన్నీ కొత్త నిర్ణయానికి లింకేంటి?
పుష్ఫరాజ్ రెండో సారి బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. కాకపోతే కలెక్షన్ల లెక్కల్లోనే అనుమానాల, గుసగుసలు తప్ప, రిజల్ట్ మీద ఎలాంటి డౌట్లు లేవు. హిందీ బెల్ట్ లో వస్తున్న వసూళ్లే ఈ సినిమాను 1500 కోట్ల క్లబ్ లో చేర్చింది. బేసిగ్గా ఇలాంటి టైంలో బన్నీ అండ్ టీ సెలబ్రేట్ చేసుకోవాలి. కాని అందుకు భిన్నంగా కంగారు పడుతోంది
విచిత్రం ఏంటంటే త్రివిక్రమ్ తో తను కమిటైన పాన్ ఇండియా మూవీ పట్టాలెక్కబోయే వేల, ఆ ప్రాజెక్టు పట్టాలు తప్పేలా ఉంది. ఒకసారి ఎనౌన్స్ చేసి, తర్వాత మళ్లీ మనసు మార్చుకున్న బన్నీ, పుష్ప2 హిట్ తర్వాత మళ్లీ మాటల మాంత్రికుడే కావాలన్నాడు.. మళ్ళీ ఇప్పడు కొత్త ప్రయోగం వద్దు, పాత పుష్ప కే మూడో సీక్వెల్ ముద్దంటున్నాడు
మొన్నటి వరకు మరో రెండు మూడేళ్ల వరకు పుష్ప3 కి ఛాన్సే లేదన్నారు. ఈలోపు కొత్త ప్రయోగాలు చేస్తాడన్నారు… కాని లోపల ఎక్కడో టెన్షన్.. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తో చరణ్ కి క్రేజ్ వచ్చాక, ఆచార్య చేస్తే ఏమైంది..గేమ్ ఛేంజర్ ఎందుు డైలామాలో ఉంది.. సో ఇలానే తన పరిస్తితి కాకూడదంటే, పుష్ప 1, పుష్ప2 తో వచ్చిన ఇమేజ్, ని పుష్ప3 తో కాపాడాలనుకుంటున్నాడట
దీనికి కారణం కల్కీ 2, సలార్ 2, దేవర 2నే… మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే దేవర తర్వాత వార్2, డ్రాగన్ చేస్తూనే మళ్లీ కలిసొచ్చిన దేవర 2 కి ప్లాన్ చేస్తున్నాడు. హిట్ మూవీకి సీక్వెల్ అంటే హిట్ట అవ్వాల్సిందే అని పుష్ప2 కూడా మరో సారి ప్రూవ్ చేసింది. కాబట్టి దేవర 2 మూవీ 2025 ఇయర్ ఎండ్ లో మొదలవ్వటం ఫైనల్ అయ్యింది
దీనికి తోడు కల్కీ 2 ని వచ్చే ఏడాది చివర్లో మొదలు పెట్టబోతున్నాడు ప్రభాస్, సలార్ 2 కూడా ప్యార్ లల్ గా వచ్చే ఏడాది ఎండ్ లో లేదంటే, 2026 బిగినింగ్ లో మొదలవ్వొచ్చు.. సో ఈ సీక్వెల్లన్నీ హిట్ అని తెరకెక్కకముందే ఫిక్స్ అవ్వాలి… సో 2026, లేదంటే 2027లోనే కల్కీ2, దేవర2, సలార్ 2 వచ్చే చాన్స్ ఉంది… అలా ప్రభాస్, ఎన్టీఆర్ 100శాతం సక్సెన్ ని ముందే కన్ఫామ్ చేసుకుని వస్తున్న వేళ, బిక్కు బిక్కుమంటూత్రివిక్రమ్ మూవీతో సాహసం చేయాల? ఇది బన్నీ మనసులో మెదులుతున్న మాట..
అందుకే పుష్ప3 కోసం 15 శాతం ఫుటేజ్ ఎలాగూ ఉంది. కాబట్టి, పుష్ఫ 3 ని ఎప్పుడో ప్లాన్ చేసేకంటే, ఇప్పుడే ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే నిర్ణయానికొచ్చారట. ఎలాగూ చరణ్ తో సుకుమార్ కమిటైన ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే, బుచ్చి బాబు మూవీ పూర్తవ్వాలి… సో ఆలోపు పుష్ప3 రాంపేజ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే డిస్కర్షన్ వచ్చిందట. తోటి హీరోలంతా పాన్ ఇండియా లెవల్లో దూసుకెళుతుంటే, బన్నీ మాత్రం త్రివిక్రమ్ సినిమా తో హిట్ ని డౌట్ లో పడేయటం ఎందుకని, పుష్ప 3కే మొగ్గుచూపుతున్నాడట ఐకాన్ స్టార్