Pushpa2 : ‘పుష్ప ఆ గెట‌ప్‌లో క‌నిపించ‌నున్న బ‌న్నీ..?

స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన పుష్ప సినిమా యావ‌త్ ప్రపంచాన్ని ఉర్రూత‌లూగించింది.. ద‌ర్శ‌కుడు సుకుమార్ సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2024 | 10:47 AMLast Updated on: Mar 18, 2024 | 10:47 AM

Pushpa2 పుష్ప ఆ గెటప్లో కని

స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన పుష్ప సినిమా యావ‌త్ ప్రపంచాన్ని ఉర్రూత‌లూగించింది.. ద‌ర్శ‌కుడు సుకుమార్ సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు. ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేసినప్పుడు పెద్ద‌గా ఇంపాక్ట్ ఏమీ క్రియేల్ కాలేదు.. కానీ ఎప్పుడైతే సినిమా, పాట‌లు రిలీజ్ అయ్యాయో సీన్ మొత్తం మారిపోయింది. పుష్ప రాజ్ (Pushpa Raj) థియేట‌ర్ల‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గానే.. యావ‌త్ ప్ర‌పంచానికి పుష్ప ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. ఆ క్రేజ్ సినీ, రాజ‌కీయ‌, క్రీడా సెల‌బ్రిటీల వ‌ర‌కు వెళ్లిపోయింది. దీంతో.. పుష్ప‌-2 (Pushpa2) ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక పార్ట్ 2 నుంచి వ‌స్తున్న అప్‌డేట్స్ మూవీపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను స్కై హైగా పెంచేస్తున్నాయి. ఈ టైమ్‌లో పుష్ప‌-2 నుంచి వినిపిస్తున్న ఓ లేటెస్ట్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

పుష్ప‌-2 నుంచి ఇప్ప‌టికే వ‌స్తున్న రూమ‌ర్స్, లీకులు ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పుష్ప‌-2లో బ‌న్నీ యాక్టింగ్‌ను చూడ్డానికి క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో ఈ మూవీకి మ‌రింత హైప్ ఇచ్చేలా ఓ రూమ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అల్లు అర్జున్ ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడన్న న్యూస్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.. కేవ‌లం గెటప్ లోనే కాకుండా.. బన్నీ తన వాయిస్ మాడ్యులేషన్ ను కూడా ఓల్డ్ ఏజ్ స్టైల్ లో చెప్పబోతున్నాడట‌.. ఈ క్యారెక్ట‌ర్‌లో బన్నీ డైలాగ్స్ కూడా కొత్తగా ఉండబోతున్నాయట‌.. ఈ న్యూస్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

పుష్ప 2లో బ‌న్నీ చీర క‌ట్టులో అమ్మోరు త‌ల్లి లుక్‌కు.. ఫ్యాన్స్‌లో ఇప్ప‌టికే పూన‌కాలు వ‌చ్చేసాయి. ఇక‌.. ఇంట‌ర్వెల్ సీక్వెన్స్‌ను సుకుమార్ హైఓల్టేజ్ ఎపిసోడ్‌గా తీర్చిదిద్దాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఇందులో బన్నీ యాక్టింగ్‌కు గూస్ బంప్స్ రావ‌డం ప‌క్కా అంటున్నారు. పైగా ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. ఫ‌స్ట్ పార్ట్‌లాగానే పుష్ప‌-2 లోనూ దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తాడ‌ని అంటున్నారు. మ‌రి.. ఇన్ని భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ ఏడాది ఆగ‌స్టు 15న రిలీజ్ కాబోతున్న పుష్ప‌-2 ఫ్యాన్స్ అంచ‌నాల‌ను ఏ మేర‌కు అందుకుంటుందో చూడాల్సిందే..