Pushpa2 The Rule: యాక్షన్ మోడ్.. జపాన్ డాన్‌తో పుష్పరాజ్ భారీ ఫైట్
రెండు సంవత్సరాల క్రితం పుష్ప ది రైజ్ ఎంత సంచలన విజయాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతే కాదు.. ఆ చిత్రంలో నటనకుగాను ఉత్తమ కథనాయయకుడిగా జాతీయ అవార్డు కూడా దక్కింది.
Pushpa2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప ది రూల్. రెండు సంవత్సరాల క్రితం పుష్ప ది రైజ్ ఎంత సంచలన విజయాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతే కాదు.. ఆ చిత్రంలో నటనకుగాను ఉత్తమ కథనాయయకుడిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. మరీ అలాంటి ఘన విజయాన్ని సాధించిన చిత్రానికి సీక్వెల్‌గా వస్తుందంటే మరింకెంత కసరత్తు చేయాలో కదా.
TOLLYWOOD MOVIES: అసలేం జరుగుతోంది! పాన్ ఇండియా సినిమాలన్నీ వాయిదా..
అందుకే ఎక్కడా తగ్గకుండా దాదాపు 300 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపోందుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులకే కాదు యావత్తు సినీ ప్రేక్షకులకు సైతం ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే మొదటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ అంశం నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన 3 నిమిషాల వీడియోతో ఎంతో హైప్ క్రియేట్ చేశాడు. అలాగే యాక్షన్ సీన్లు చాలా కొత్తగా ఉండేలా కొరియోగ్రఫీ చేస్తున్నారట. మొదటి పార్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ మన దగ్గరే చిత్రీకరించారు. అయితే పుష్ప2 కు సంబంధించిన ఒక యాక్షన్ సీన్‌ను జపాన్‌లో షూట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దానికి సంబంధించిన పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
కథ ప్రకారం పుష్పరాజ్ ఒక భారీ డీల్ కోసం జపాన్ వెళ్తాడు. అక్కడ మాఫియా డాన్‌తో డీల్ కుదరదు. ఎంతైన మన హీరో తగ్గేదేలే అంటాడు కదా.. దాంతో సీన్ రివర్స్ అవుతుంది. అక్కడి నుంచి పుష్ప బయటపడటం కూడా కష్టతరం అవుతుంది. చుట్టూ వందల మంది మార్షల్ ఆర్ట్స్ విలన్ గ్యాంగ్ ఉంటుంది. వాళ్లతో హీరో ఫైట్ చేయాలి. దీన్ని ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారట. ఈ యాక్షన్ సీన్ కచ్చితంగా సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.