Allu Arjun : పుష్ప‌గాడి మాస్ జాత‌ర త‌ప్ప‌దా..

పుష్ప 2 (Pushpa2) సినిమా టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్పకు సీక్వెల్‍గా వస్తున్న ఈ చిత్రంపై హైప్ పీక్స్‌లో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 భారీ స్థాయిలో రూపొందుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 5, 2024 | 11:15 AMLast Updated on: Apr 05, 2024 | 11:15 AM

Pushpagadi Mass Jatara Except

పుష్ప 2 (Pushpa2) సినిమా టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్పకు సీక్వెల్‍గా వస్తున్న ఈ చిత్రంపై హైప్ పీక్స్‌లో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 భారీ స్థాయిలో రూపొందుతోంది. హీరో అల్లు అర్జున్ (Star Hero Allu Arjun) పుట్టిన రోజు ఏప్రిల్ 8న సాలిడ్ టీజర్ కట్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేశారు.. అప్ప‌టి నుంచి ఫ్యాన్స్ కంటి మీద కునుకు కూడా లేకుండా పుష్ప గాడి మాస్ జాత‌ర కోసం వెయిట్ చేస్తున్నారు.

గత ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజుకి ఓ స్పెషల్ వీడియోని తీసుకు వచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేసిన పుష్ప టీం.. ఈ ఏడాదికి టీజర్ ని తీసుకు రాబోతున్నారు. దీంతో.. ఈ టీజ‌ర్ ఎలా ఉండ‌బోతున్న‌దానిపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ టీజర్ అప్డేట్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ప్ర‌కారం.. ఈ టీజ‌ర్ జాతర సాంగ్ కి సంబంధించిందని తెలుస్తోంది. జాతరలో అల్లు అర్జున్ అమ్మోరులా నాట్యం చేయనున్నాడ‌ని.. ఆ డ్యాన్స్ గూస్ బంప్స్ తెప్పించ‌డం ఖాయ‌మంటున్నారు.

అలాగే ఆ బ్యాక్ డ్రాప్ లో ఓ అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందంటున్నారు. అంతేకాకుండా ఈ టీజర్ లో పుష్ప పాత్ర ఎలా ఎదిగింది అనే అంశానికి సంబంధించి క్రేజీ సీక్వెన్స్ లు కనిపిస్తాయని కూడా తెలుస్తోంది. పార్ట్ 1 టీజర్ ఎండింగ్ లో ‘తగ్గేదేలే’ డైలాగ్ ఉన్నట్టుగా.. ఈసారి టీజర్ అది లేదా దానికి అప్డేటెడ్ వెర్షన్ డైలాగ్ ఉండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది.. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎలిమెంట్‌గా రాబోతున్న ఈ ప‌వ‌ర్ ప్యాక్డ్ టీజ‌ర్ బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఫుల్ బ‌ర్త్‌డే ట్రీట్ ఇవ్వ‌డం ఖాయ‌మంటున్నారు. మ‌రి.. హై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌ధ్య రిలీజ్ కాబోతున్న పుష్ప‌-2 టీజ‌ర్ ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుందో చూడాల్సిందే..