పుష్పనే గెలిచాడు.. ఫ్యాన్స్ పరువు తీసిన మెగా ఫ్యామిలీ
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ సినిమాలు అంటే కచ్చితంగా మాస్ ఆడియన్స్ కు పండగే. మెగా ఫ్యామిలీ గతంలో మాదిరిగా స్పీడ్ గా సినిమాలు చేయకుండా కాస్త ఆచితూచి వ్యవహరిస్తుంది.
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ సినిమాలు అంటే కచ్చితంగా మాస్ ఆడియన్స్ కు పండగే. మెగా ఫ్యామిలీ గతంలో మాదిరిగా స్పీడ్ గా సినిమాలు చేయకుండా కాస్త ఆచితూచి వ్యవహరిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఏడాదికి ఒక సినిమా లేదంటే రెండేళ్లకి ఒక సినిమా చేస్తున్నారు. ఇక రాంచరణ్ అయితే మూడేళ్ల క్రితం ఒక సినిమా చేయగా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో అభిమానులను పలకరించాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే ఒక సినిమా రిలీజ్ చేస్తారు.
హరిహర వీరమల్లు అనే సినిమా ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో వస్తున్నా ఈ సినిమాపై మెగా ఫాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మెగా ఫ్యామిలీ ఒక విషయంలో ఒత్తిడిలో కనపడుతుంది అనే క్లారిటీ వస్తుంది. అల్లు అర్జున్ ను ఎదుర్కొనే విషయంలో సినిమాల పరంగా మెగా ఫ్యామిలీ ఇప్పుడు వెనకబడే ఉంటుంది అనే ఒపీనియన్ వినపడుతోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో భారీ హీట్ కొట్టాడు. గేమ్స్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ కూడా అదే రేంజ్ లో హిట్ కొడతారని ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారు.
కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి వేరే లాగా ఉంది. ఇక మెగాస్టార్ కూడా ఇప్పుడు తన సినిమా విశ్వంభరా విషయంలో చాలా హోప్స్ పెట్టుకున్నారు. అందుకే సినిమా షూటింగ్ ఆలస్యమైనా సరే ఖచ్చితంగా హిట్టు కొట్టాలి అనే ధీమాలో చిరంజీవి ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 5 ఏళ్ల తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆయనపై కూడా ఒత్తిడి ఎక్కువగానే ఉంది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినా సరే సినిమాల పరంగా మాత్రం ఆయనకు 12 ఏళ్ల క్రితం భారీ హిట్ వచ్చింది.
అప్పటినుంచి ఇప్పటివరకు మంచి సినిమానే పవన్ కళ్యాణ్ నుంచి రాలేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు హిట్ అయినా సరే అవి పవన్ రేంజ్ కి తగ్గ హిట్లు కాదు. ఒకవైపు మెగా, ఫాన్స్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్న టైంలో మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమాలు వాళ్లకు రక్తకన్నీరు కారుస్తున్నాయి. సినిమాలపై ఎన్నో హోప్స్ పెట్టుకొని థియేటర్ కు వెళుతుంటే భారీ డిజాస్టర్ అవుతున్నాయి. ఆచార్య సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. భోళా శంకర్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. గాడ్ ఫాదర్ సినిమా కూడా చిరంజీవికి డిజాస్టర్ గానే చెప్పాలి. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పటివరకు సినిమా రిలీజ్ చేయకపోగా రిలీజ్ చేసిన సినిమా డిజాస్టర్ కావడంతో మెగా ఫాన్స్ తలెత్తుకోలేకపోతున్నారు.