Pushpa2 : పుష్పరాజ్ ఫ్రెండ్ వచ్చేశాడు మచ్చా!

టాలీవుడ్‌తో(Tollywood) పాటు పాన్ ఇండియా (Pan India) మూవీ లవర్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మోస్ట్‌ అవైటేడ్‌ ప్రాజెక్ట్‌ పుష్ప2. సుకుమార్‌ డైరెక్షన్లో అల్లు అర్జున్‌ హీరోగా బ్లాక్‌ బస్టర్ హిట్‌ కొట్టిన పుష్ప.. ది రైజ్‌కు సీక్వెల్‌గా పుష్ప.. ది రూల్‌ తెరకెక్కుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2024 | 09:01 AMLast Updated on: Feb 03, 2024 | 9:01 AM

Pushparajs Friend Has Arrived

 

టాలీవుడ్‌తో(Tollywood) పాటు పాన్ ఇండియా (Pan India) మూవీ లవర్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మోస్ట్‌ అవైటేడ్‌ ప్రాజెక్ట్‌ పుష్ప2. సుకుమార్‌ డైరెక్షన్లో అల్లు అర్జున్‌ హీరోగా బ్లాక్‌ బస్టర్ హిట్‌ కొట్టిన పుష్ప.. ది రైజ్‌కు సీక్వెల్‌గా పుష్ప.. ది రూల్‌ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్టులో శ్రీవల్లి (Srivalli) గా నటించిన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే పుష్పరాజ్‌ ఫ్రెండ్‌గా కేశవ పాత్రలో జగదీశ్‌ ప్రతాప్ బండారి నటిస్తున్నాడు. సీక్వెల్‌లో కూడా జగదీశ్‌ (Jagdish) క్యారెక్టర్‌కు ఇంపార్టెంట్ రోల్ ఉంది. అయితే ఆ మధ్య ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ సూసైడ్‌ కేసుకు సంబంధించిన విషయంలో జగదీశ్‌ని అరెస్ట్ చేశారు.

ఆకస్మికంగా కేశవ (Keshav) కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్లడం.. చిత్ర యూనిట్‌కి ఒక ఊహించని షాక్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పుష్ప 2 షూటింగ్ వాయిదా పడినట్టుగా వార్తలు వచ్చాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జగదీశ్‌ బెయిల్‌పై విడుదలై.. పుష్ప 2 షూటింగ్‌లో జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. సినిమాలో కీలకంగా వచ్చే గంగమ్మ జాతర సీన్‌ షూట్‌లో జగదీశ్ పాల్గొంటున్నట్టు సమాచారం.

ప్రస్తుతం పుష్ప 2 (Pushpa2) యూనిట్ మిగతా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి అనుకున్న సమయానికి పుష్ప2 రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా వాయిదా పడుతుందని పుకార్లు వస్తున్నప్పటికీ.. అలాంటిదేం లేదు, ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టు 15న పుష్పరాజ్ (Pushparaj) థియేర్లోకి రావడం పక్కా అని క్లారిటీ ఇస్తునే ఉన్నారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి