మైత్రీ కక్కుర్తి పుష్పను మింగేస్తుందా…? పుష్పకు ఫ్యామిలీ ఆడియన్స్ షాక్…
పుష్ప మేకర్స్ కక్కుర్తే పుష్పను మింగేస్తుందా...? ఇప్పుడు ఫ్యాన్స్ ఫైర్ చూస్తే పుష్ప ఓపెనింగ్ డే కలెక్షన్స్ బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ కనపడుతోంది. సాధారణంగా సినిమా టికెట్లు ధరలపై అభిమానుల్లో ముందు నుంచి ఓ రకమైన అసహనం ఉంటుంది.
పుష్ప మేకర్స్ కక్కుర్తే పుష్పను మింగేస్తుందా…? ఇప్పుడు ఫ్యాన్స్ ఫైర్ చూస్తే పుష్ప ఓపెనింగ్ డే కలెక్షన్స్ బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ కనపడుతోంది. సాధారణంగా సినిమా టికెట్లు ధరలపై అభిమానుల్లో ముందు నుంచి ఓ రకమైన అసహనం ఉంటుంది. సినిమా వసూళ్ళ కోసం తమ అభిమానాన్ని వాడుకుంటున్నారనే కోపం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. తాజాగా పుష్ప పార్ట్ 2 విషయంలో ఇప్పుడు అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇవ్వడంతో టికెట్ రేట్లను భారీగా పెంచేశారు.
మొదటి నాలుగు రోజులు మల్టీప్లెక్స్ లో 550 పైగా టికెట్ ధర ఉండటం పట్ల అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఇండియా వైడ్ గా మూవీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు అనే కారణంతో దీనిని క్యాష్ చేసుకునేందుకు మైత్రి మూవీ మేకర్స్ భారీగా పుష్ప 2 టికెట్ ధరలను పెంచేసింహి. బెనిఫిట్ షోల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారు. దాదాపుగా 850 కి పైగా టికెట్ రేటు ఉండటం పట్ల అభిమానులు నానా తిట్లు తిడుతున్నారు. ఇదే విధంగా కొనసాగితే కచ్చితంగా భవిష్యత్తులో ఓటీటీలలో సినిమాలు చూడటం పెరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు.
ఒక ఫ్యామిలీ బెనిఫిట్ షో చూడాలంటే ఎంత ఖర్చు చేయాలంటూ మైత్రీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే సినిమా హాల్లోకి వెళ్లే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయిందని అభిమానులు ఫైర్ అవుతున్నారు… ఆ ధరలతో ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ నాలుగు రోజులు సినిమా చూడటం కష్టమే అంటున్నారు. సినిమాలో గతంలో ఎన్నడూ లేని విధంగా 12 వేల స్క్రీన్ లలో విడుదల చేస్తున్న మాట వాస్తవమే… కానీ టికెట్ ధరలను దాదాపుగా 250 రెట్లు పెంచేసారని అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.
సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఎమోషన్స్ తో మేకర్స్ ఆడుకుంటున్నారని ఇదే కంటిన్యూ అయితే మాత్రం కచ్చితంగా పుష్ప సినిమా మొదటి నాలుగు రోజులు వసూళ్లు కచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంటుందంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ నెల ఐదున పుష్ప 2 గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే నిర్వహించిన ఈవెంట్లకు భారీగా రెస్పాన్స్ వస్తోంది నార్త్ లో కూడా సినిమా కోసం అభిమానులు పిచ్చపిచ్చగా ఎదురు చూస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫ్రీ బుకింగ్ ఓపెనింగ్స్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ గంటలు లెక్కబెడుతున్నారు.
తెలంగాణలో నాలుగో తారీఖు సాయంత్రం నుంచి పుష్ప బెనిఫిట్ షోలు మొదలుకానున్నాయి ఈ బెనిఫిట్ షోలకు సినిమాకు ఉన్న క్రేజీ ని బేస్ చేసుకుని భారీగా వసూలు చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. స్టార్ హీరోలకు భారీగా రెమ్యూనరేషన్లు ఇవ్వడం ఎందుకని ఇలా అభిమానుల నుంచి వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.