పుష్ప ని వదిలేసిన పుష్ప టీం… వేర్ ఈజ్ అనసూయ, సునీల్, రష్మిక

సంధ్య ధియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ ను అన్ని వర్గాల నుంచి టార్గెట్ చేశారు. సమాజంలో అతన్ని ఒకరకంగా దోషిగా కూడా చూసారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా వాళ్లకు సమాజంలో ఉన్న గౌరవం కొంత తగ్గింది అనే ఒపీనియన్ కూడా గట్టిగానే వినపడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 03:15 PMLast Updated on: Jan 02, 2025 | 3:15 PM

Pushpas Team Left Pushpa Where Is Anasuya Sunil Rashmika

సంధ్య ధియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ ను అన్ని వర్గాల నుంచి టార్గెట్ చేశారు. సమాజంలో అతన్ని ఒకరకంగా దోషిగా కూడా చూసారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా వాళ్లకు సమాజంలో ఉన్న గౌరవం కొంత తగ్గింది అనే ఒపీనియన్ కూడా గట్టిగానే వినపడింది. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ఆ తర్వాత జైలుకు వెళ్లడం… తర్వాత జైలు నుంచి విడుదల కావడం, సినిమా వాళ్ళందరూ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ టార్గెట్ గా విమర్శలు చేయడం… అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేయడం ఇలా చాలానే జరిగాయి.

పుష్ప సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయడం కంటే ఈ విషయంలోనే అల్లు అర్జున్ ఎక్కువ ఇబ్బంది పడ్డాడు. ఇక దీనితో అతనితో అతని కుటుంబంతో సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ అతని ఇంటికి వెళ్లి పరామర్శిస్తూ వచ్చారు. కానీ పుష్ప సినిమాలో నటించిన అనసూయ గాని, సునీల్ గాని, రష్మిక మందన గాని, హీరోయిన్ శ్రీల గాని ఇలా చాలామంది అసలు అల్లు అర్జున్ పరామర్శించేందుకు ఇష్టపడలేదు. కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు తప్ప స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించటం కనీసం మాట్లాడి రావడం ఏ ఒక్కటీ చేయలేదు.

అటు ఈ సినిమాలో విలన్ గా నటించిన ఫాహద్ ఫాసిల్ కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టినప్పుడు వీళ్ళు అసలు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టి సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించలేదు. ఇక సుకుమార్ నుంచి కూడా పెద్దగా స్పందన ఉన్నట్టు కనపడలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఇబ్బంది పడుతున్న సమయంలో గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళాడు సుకుమార్. ఆ తర్వాత కూడా పెద్దగా సుకుమార్ నుంచి రియాక్షన్స్ లేవనే చెప్పాలి.

అల్లు అర్జున్ ఎన్నో ఇబ్బందులు పడుతున్న టైంలో ఇలా పుష్పా సినిమాలో నటించిన వాళ్లందరూ తమకేమీ పట్టనట్టు బిహేవ్ చేయడం మాత్రం అల్లు అర్జున్ మరింత హర్ట్ చేసింది. ముఖ్యంగా సునీల్, అనసూయ, రష్మిక మందన కనీసం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లకపోవడం ఎవరి మెప్పుకోసం అనే కామెంట్స్ వస్తున్నాయి. రష్మిక మందన ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎక్కడికో వెళ్లిపోయింది అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న రష్మిక మందన రీసెంట్గా ముంబై ఎయిర్పోర్టులో అతనితో కలిసి దొరికిపోయింది. ఇలా ఈ సినిమాలో నటించిన వాళ్లందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పాపం,పుణ్యం మాత్రం పుష్ప తీసుకున్నాడు.