Pushpa 2 : జపాన్ ఫ్లైట్ ఎక్కనున్న పుష్పరాజ్..
ఎలాంటి వాయిదాలు లేకుండా.. అనుకున్న సమయానికి ఆగష్టు 15న థియేటర్లోకి రావాలని ఫిక్స్ అయిపోయాడు పుష్పరాజ్(Pushparaj). ప్రస్తుతం పుష్ప2 (Pushpa2) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

Pushpraj will board the flight to Japan.
ఎలాంటి వాయిదాలు లేకుండా.. అనుకున్న సమయానికి ఆగష్టు 15న థియేటర్లోకి రావాలని ఫిక్స్ అయిపోయాడు పుష్పరాజ్(Pushparaj). ప్రస్తుతం పుష్ప2 (Pushpa2) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో పుష్పరాజ్ ఫ్రెండ్‌గా నటించిన కేశవ తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టడంతో.. అందుకు సంబంధించిన సీన్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ సీన్స్ షూట్ చేస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ జాతర్ సెటప్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ను షూట్ చేసినట్టుగా సమాచారం. దీంతో నెక్ట్స్ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట. గత కొద్ది రోజులుగా జపాన్‌లో పుష్పరాజ్‌తో భారీ ఫైట్ ఉంటుందని.. సినిమాకే అది హైలెట్‌గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో నెక్స్ట్ షెడ్యూల్ కోసం జపాన్ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నాడట పుష్పరాజ్. అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం.
ఆ తర్వాత షెడ్యూల్‌ని కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టి.. పుష్ప2 షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు సుకుమార్(Sukumar). ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా.. అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేస్తు పుష్ప2 తెరకెక్కిస్తున్నారు. మేకర్స్. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్(Fahad Fazil), సునీల్(Sunil), అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ (Devishri Prasad) సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ (Mythri Movie Makers Banner) పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది పుష్ప2 మరి ఈసారి బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.