అరవొళ్ళకు 2024 భారీ బొక్క, 3 వేల కోట్లు పెడితే వెయ్యి కోట్లు లాస్

భారీ బడ్జెట్ సినిమాలు మోజులో పడి సినిమా ఇండస్ట్రీలు షేక్ అవుతున్నాయి. స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2025 | 12:58 PMLast Updated on: Jan 31, 2025 | 12:58 PM

Put 3 Thousand Crores It Will Be A Loss Of 1000 Crores

భారీ బడ్జెట్ సినిమాలు మోజులో పడి సినిమా ఇండస్ట్రీలు షేక్ అవుతున్నాయి. స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం.. డైరెక్టర్లు కూడా కథలు అలాగే రాయడంతో నిర్మాతలు భారీగా పెట్టుబడి పెట్టేస్తున్నారు. కానీ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మాత్రం బొమ్మ వేరేలా ఉంటుంది. ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పడం చాలా కష్టమైపోతుంది. సినిమా చాలా బాగా వచ్చినా సరే ఆడియన్స్ ఇష్టపడతారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు తమిళ సినిమా ఒకరకంగా భారీ నష్టాల్లో కూరుకుపోయింది అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళంలో వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ కావడంతో తమిళ సినిమా గత ఏడాది 1000 కోట్లకు పైగా నష్టాలు చూసిందని అంచనా వేస్తున్నారు. భారీ అంచనాలతో వచ్చిన భారతీయుడు 2 అలాగే సూర్య హీరోగా వచ్చిన కంగువా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఏమాత్రం అంచనా లేకుండా వచ్చిన అమరన్, మహారాజా వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే గరుడన్ అనే సినిమా కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తే భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమైపోయింది.

తమిళ నిర్మాతలు గత ఏడాది మొత్తం 1000 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు 2 సినిమాను 250 కోట్లతో నిర్మిస్తే కనీసం 150 కోట్లు రావడం కూడా కష్టమైపోయింది. ఇక కంగువ సినిమాను దాదాపు 350 కోట్లు పెట్టి నిర్మిస్తే కనీసం 150 కోట్లు కూడా రాలేదని సమాచారం. గత ఏడాది తమిళ నిర్మాతలు దాదాపు 3 వేల కోట్లతో 241 సినిమాలు నిర్మించి విడుదల చేస్తే వాటిలో కేవలం 18 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి.

223 సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దీనితో వెయ్యి కోట్లకు పైగా తమిళ సినిమాలకు నష్టం వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. 2024వ సంవత్సరం తమిళ సినిమాకు ఒక పీడకలా అని అక్కడ మీడియా చెప్తోంది. సూర్య హీరోగా వచ్చిన కంగువా అలాగే కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు 2 కారణంగానే తమిళ సినిమాకు భారీ నష్టాలు వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఇక రజనీకాంత్ హీరోగా వచ్చిన వేట్టాయన్ అనే సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకు ప్రమోషన్స్ గట్టిగా చేసిన సరే ఫ్లాప్ అయింది. కథలో పట్టు లేకపోవడంతో సినిమా ఆడలేదు. అలాగే విజయ్ హీరోగా వచ్చిన గోట్ అనే సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో వచ్చే తమిళనాడు నిర్మాతలను ముంచేసాయి దీనితో ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటే తమిళనాడు నిర్మాతలు భయపడిపోతున్నారు. సినిమాల ప్రమోషన్ కు ఇతర భాషలపై కూడా ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు.