Raghavendra Rao: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న అకీరా.. రాఘవేంద్రరావుతో ఫొటో అందుకేనా.?
పవన్ కల్యాణ్ పెద్ద కొడుకు అకీరా.. ఈ మధ్య జనాల్లో తెగ సందడి చేస్తున్నాడు. బ్రో మూవీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వచ్చి మరీ ఫ్యాన్స్‌తో కలిసి చూశాడు అకీరా.

Raghavendra Rao shared a photo with Akira on Twitter. He also told mega fans a news like a festival.
పవన్ కల్యాణ్ పెద్ద కొడుకు అకీరా.. ఈ మధ్య జనాల్లో తెగ సందడి చేస్తున్నాడు. బ్రో మూవీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వచ్చి మరీ ఫ్యాన్స్‌తో కలిసి చూశాడు అకీరా. ఆయన హైట్, ఫిజిక్ చూసి.. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేశాడోచ్ అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అకీరా సిల్వర్‌స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడు అని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్న వేళ.. ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో కలిసి అకీరా నందన్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న చాలామంది హీరోలను.. లాంచ్ చేసింది రాఘవేంద్రరావే. అకీరాను కూడా హీరోగా తీసుకురాబోతున్నాడని చర్చ మొదలైంది.
ట్విటర్ వేదికగా అకీరాతో కలిసి దిగిన ఫొటోను రాఘవేంద్రరావు షేర్ చేశారు. మెగా అభిమానులకు పండగలాంటి వార్త కూడా చెప్పారు. ఆయన మనవడు కార్తికేయ, అకీరాతో దిగిన ఫొటో పంచుకున్న దర్శకేంద్రుడు.. నాలుగో తరం అబ్బాయిలతో రాఘవేంద్రరావు. నా మనవడు కార్తికేయ, పవన్ కుమారుడు అకీరా నందన్.. ఇద్దరూ అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరారు అని రాశారు. ఐతే ఈ ట్వీట్‌ను ఆయన కొద్దిసేపటికే తొలగించారు. అప్పటికే అప్పటికే ఫొటో వైరలైంది. దీంతో అభిమానులంతా మరికొద్దిరోజుల్లో అకీరాను బిగ్ స్క్రీన్‌పై చూడనున్నామని సంబరపడుతూ.. ఫొటోను షేర్ చేస్తున్నారు. ఐతే దీనిపై రేణూ దేశాయ్ ఇన్‌స్టాలో రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతానికి అకీరాకు నటనపై ఆసక్తి లేదు. హీరో కావాలని అనుకోవడం లేదని.. భవిష్యత్తులో తన నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేనని.. ఏదైనా పోస్ట్ చేసిన వెంటనే దానికి సంబంధించిన ఊహాగానాలు ఆపేయండి అంటూ రాసుకొచ్చింది. ఒకవేళ అకీరా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే.. ఆ విషయాన్ని కచ్చితంగా పంచుకుంటానని క్లారిటీ ఇచ్చింది.