Maname : పిల్లల్ని పెంచడం యూట్యూబ్ చూసినంత ఈజీ కాదు
తెలుగు పరిశ్రమలో క్లీన్ హీరోలో వరుసలో శర్వానంద్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఆయన సినిమాలు మాత్రమే కాదు తాను కూడా చాలా ప్యూర్‌గా ఉంటాడు.

Raising children is not as easy as watching YouTube
తెలుగు పరిశ్రమలో క్లీన్ హీరోలో వరుసలో శర్వానంద్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఆయన సినిమాలు మాత్రమే కాదు తాను కూడా చాలా ప్యూర్‌గా ఉంటాడు. గత కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక అందాల భామ కృతి శెట్టికి (Kriti Shetty) సైతం మంచి బ్రేక్ కావాలి. ఈ నేపథ్యంలో ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ మనమే. కుటుంబ కథ ఎమోషనల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
ఈ ట్రైలర్‌లో హీరోహీరోయిన్ల మధ్య డైలాగ్స్, హీరో కామెడీ టైమింగ్ బాగున్నాయి. ఇద్దరు కలిసి ఓ బాబును పెంచుతున్నట్లు ఇందులో చూపించారు. దానిపైనే ఎమోషనల్ డైలాగ్స్ సైతం ఉన్నాయి. మరీ ఆ బాబు ఎవరు, వీరిద్దరి కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ట్రైలర్ చూస్తే సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ (Family Entertainer) అని అర్థం అవుతుంది. హేశం అబ్దుల్ వహాబ్ అందించిన బీజీఎం ఆకట్టుకుంటుంది. విభిన్న సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారంటే ఏదో కిక్ ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా జూన్ 7న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్, టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు ఆ హైప్‌ను మరింత విస్తరించేలా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.ఈ సారి ‘మనమే’ (Manamey) ద్వారా శర్వానంద్‌కు మంచి హిట్ ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి రిలీజ్ అయ్యాక ఈ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.