రాజా సాబ్ రైట్స్… 25 కోట్లు.. 250 కోట్లు.. 450 కోట్లు…
ది రాజా సాబ్ థియేటర్స్ లో అడుగు పెట్టేది వచ్చే ఏడాది సమ్మర్ లో...కాని కలెక్షన్ల గోల ఇప్పడే పెరిగేలా ఉంది. బేసిగ్గా ఓ మూవీ రిలీజైతే వసూళ్ల వరదొస్తుంది. దాంతో కాసుల కలొస్తుంది... కాని కొన్ని కటౌట్స్ సీన్ లో కొస్తే, కాసుల కళ బాక్సాఫీస్ లోనే కాదు,
ది రాజా సాబ్ థియేటర్స్ లో అడుగు పెట్టేది వచ్చే ఏడాది సమ్మర్ లో…కాని కలెక్షన్ల గోల ఇప్పడే పెరిగేలా ఉంది. బేసిగ్గా ఓ మూవీ రిలీజైతే వసూళ్ల వరదొస్తుంది. దాంతో కాసుల కలొస్తుంది… కాని కొన్ని కటౌట్స్ సీన్ లో కొస్తే, కాసుల కళ బాక్సాఫీస్ లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా ముందుగానే మొదలౌతుంది. అలాంటి కటౌటే రెబల్ స్టార్ ప్రభాస్. దిరాజా సాబ్ ఆడియో రైట్స్ ఆల్రెడీ షాక్ ఇస్తున్నాయంటే, ఇప్పుడు ఓటీటీ రైట్స్ మతిపోగొడుతున్నాయి. థియేట్రికల్ రైట్స్ ఆల్రెడీ 700 కోట్ల వరకు పలుకుతున్నాయని తెలుస్తోంది… ఇవన్నీ లెక్కేస్తేనే 1200 కోట్ల తన కల్కీ రికార్డు బ్రేక్ అవుతోంది. ఇంతవరకు ప్రీరిలీజ్ బిజినెస్ తో వెయ్యికోట్లని టచ్ చేసిన హీరో లేడు… పుష్ప 2 కి ఆరేంజ్ వచ్చిందన్నారు కాని, ఓవరాల్ ప్రీరిలీజ్ బిజినెస్ చూస్తే, 900 కోట్లు 950 కోట్ల మధ్యే ఉంది. కాని ప్రభాస్ 1200 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ తో ట్రెండే మార్చేలా ఉన్నాడు. ఇది ఎక్కడికిపోతుందో..? మన నిర్మాతలకు డబ్బులొస్తున్నాయి కాబట్టి సంబరమే… కాని హిందీ హీరోలకు మాత్రం తెలుగు పాన్ ఇండియా స్టార్స్ ని చూస్తే చెమటలు పడుతున్నాయి. మనవాళ్లు రికార్డులతో విసిరే కొత్త ఛాలెంజులు వాళ్లని వణికిస్తున్నాయి. అసలే హిందీ ప్రొడ్యూసర్లు దివాళా తీస్తుంటే, ది రాజా సాబ్ మూవీ ప్రిరిలీజ్ బిజినెస్ తో 1200 కోట్ల షాకులిస్తే, తట్టుకోవటం కష్టమే..
ది రాజా సాబ్ ఆడియో రైట్స్ 25 కోట్లనే విషయం ప్రభాస్ రేంజ్ కి చిన్నదే.. కాని ఆ ఎమౌంట్ 25 కోట్ నుంచి 250 కోట్లకు చేరటం, అది 450 కోట్లను మించటమే ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేస్తోంది. టీ సీరీస్ ది రాజా సాబ్ రైట్స్ ని 25 కోట్లకే కొనొచ్చు, కాని ఈ సినిమా ఓటీటీ రైట్స్ 250 కోట్ల డీల్ కి సెట్ అయ్యింది.
పుష్ప 2, డ్రాన్ మూవీలు 270 కోట్లకు ఓటీటీ రైట్స్ ని ముందే సేల్ చేశాయి.. వాటితో పోలిస్తే 250 కోట్ల ది రాజా సాబ్ ఓటీటీ డీల్ 20 కోట్లు తక్కువగా కనిపిస్తుంది.. కాని అసలు విషయం ఏంటంటే, ది రాజా సాబ్ తాలూకు 250 కోట్ల డీల్ కేవలం హిందీ ఓటీటీ రైట్స్ కి సంబంధించింది. ఇంతవరకు బాలీవుడ్ హిస్టరీలోనే ఖాన్లు, కపూర్లు, కుమార్లు ఎన్ని వందలకోట్లు రాబట్టినా, వాళ్ల సినిమాల హిందీ ఓటీటీ రైట్స్ 150 కోట్లు మించలే…
అలాంటిది ఓ తెలుగు హీరో, పాన్ ఇండియా కింగ్ గా మారి, ఆసియా, అమెరికా మార్కెట్ల మీద కూడా సింహసనం వేసుకున్న కూర్చుని, తన మూవీ ఓటీటీ రైట్స్ ని 250 కోట్లకు సేల్ చేయటం ఓ రికార్డు.. కేవలం హిందీ భాషకు సంబంధించిన ఓటీటీ రైట్సే 250 కోట్లయితే, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వర్షన్ ఓటీటీ రైట్స్ ఎంత పలకొచ్చు… లెక్కేస్తే, తెలుగు రైట్స్ 75 కోట్లు, తమిళ్, మలయాళం 35 కోట్లు, కన్నడ వర్షన్ 40 కోట్లంటున్నారు. అంటే 150 కోట్లు సౌత్ వర్షన్ కే… సో మొత్తంగా ది రాజా సాబ్ అన్ని భాషల ఓటీటీ రైట్స్ 400 కోట్ల వరకు ఉండొచ్చు
యూఎస్ రైట్స్ ఏకంగా 150 కోట్ల నుంచి 175 కోట్ల వరకు సేల్ అయ్యేలా ఉన్నాయి. అదే జరిగితే, ఓటీటీ, యూఎస్ రైట్స్, ఆడియో రైట్స్ తోనే 600 కోట్ల ప్రీరిలీజ్ బిజినె్ జరుగుతోంది. ఇవన్నీ రైట్స్ మాత్రమే, థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే, నార్త్ ఇండియా రైట్స్ 400 కోట్లు, సౌత్ ఇండియా రౌైట్స్ 350 కోట్లు… అంటే 1350కోట్ల వరకు ది రాజా సాబ్ రిలీజ్ కిముందే ప్రాఫిట్స్ పట్టేస్తోంది
ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్స్ షేర్ ప్రకారం కమిటైన మూవీ కావటంతో, ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు మించలేదు. కాని ఇందుకు ఏడు రెట్ల లాభం ది రాజా సాబ్ రిలీజ్ కి 6 నెలల ముందే రాబట్టినట్టౌతోంది. తన సలార్ రికార్డులే కాదు కల్కీ తాలూకు 1200 కోట్ల వసూళ్ల రికార్డుని ది రాజాసాబ్ విడుదలకు ముందే బ్రేక్ చేస్తున్నాడు. తన రికార్డులని తానే బ్రేక్ చేస్తూ, అది కూడా సినిమా విడుదలకు 6 నెల్ల ముందే ఇలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడంటేనే, ఎవరికీ అందనంత ఎత్తులోకి రెబల్ స్టార్ ఇమేజ్ పెరిగిపోయిందని అర్ధమౌతోంది.
ది రాజా సాబ్ 1350 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ కి ఇంకా ఆస్ట్రీలియా, యూకే, న్యూజిల్యాండ్ రైట్స్ యాడ్ కాలేదు. ఇది కాకుండా యూరప్ లో మిగతా ప్రాంతాల రైట్స్ కూడా యాడ్ అయితే, ఈజీగా రిలీజ్ టైం లోగా 1500 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన రికార్డు కూడా ది రాజా సాబ్ ఎకౌంట్ లోపడే ఛాన్స్ ఉంది.