రెబల్ కాలి నొప్పులతో… 2000 కోట్లకి పురిటి నొప్పులు..

రెబల్ స్టార్ ప్రభాస్ మోకాలి నొప్పి వల్ల 4 వేల కోట్లు అలా మూలకు మూలుగుతున్నాయంటే నమ్ముతారా...అచ్చంగా అదే జరుగుతోంది. ది రాజా సాబ్ గ్రాఫిక్స్ వల్ల డిలే అవుతోంది... ఫౌజీకి రెబల్ స్టార్ మోకాలి గాయమే సమస్య అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2025 | 10:54 AMLast Updated on: Apr 12, 2025 | 10:54 AM

Raja Saab Worried About Prabhas Knee Injury

రెబల్ స్టార్ ప్రభాస్ మోకాలి నొప్పి వల్ల 4 వేల కోట్లు అలా మూలకు మూలుగుతున్నాయంటే నమ్ముతారా…అచ్చంగా అదే జరుగుతోంది. ది రాజా సాబ్ గ్రాఫిక్స్ వల్ల డిలే అవుతోంది… ఫౌజీకి రెబల్ స్టార్ మోకాలి గాయమే సమస్య అయ్యింది. అయినా ఒకటి షూటింగ్ పూర్తి చేసుకునే స్టేజ్ లోఉంటే, మరొకటి ఆగస్ట్ లోగా పూర్తయ్యే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఈ సినిమాలకు ప్రభాస్ మోకాలి గాయం సమస్యే కాదు.. కాని మరో రెండు సినిమాలకు మాత్రం డెఫినెట్ గా రెబల్ స్టార్ గాయం షాక్ ఇస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, 4 వేల కోట్ల రూపాయలు అలా మూలకు పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఏ కాలి గాయం లేదు. తనకి మరే ఇబ్బంది లేదు… అయినా తన వల్ల 2 వేల కోట్లు అలా అటకమీదే ఉండిపోవాల్సి వస్తోంది. మొన్నటి వరకంటే వార్ 2 షూటింగ్ తోనే బిజీ అయ్యాడు. ఇప్పుడు చేతిలో డ్రాగన్ మూవీ మాత్రమే ఉంది. మిగతా కమిట్మెంట్ ఎలా ఉన్నా, 2 వేల కోట్ల విషయంలో మాత్రం తానింకా డైలామాలోనే ఉన్నాడెందుకు? ఇంతకి రెబల్ స్టార్ వల్ల 4 వేల కోట్లు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల 2 వేల కోట్లు ఎందుకు మూలకే పరిమితమౌతున్నాయి…?

వాయిస్1: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్లో రెండు పాన్ ఇండియా హిట్లు పడ్డాయి. త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా గుర్తింపు తోపాటు 1400 కోట్ల రికార్డు సొంతమైంది. దేవరతో 670 కోట్ల వసూళ్లతో రెండో పాన్ఇండియా హిట్ పడింది. జపాన్ లో కూడా ఈ సినిమా దుమ్ముదులుపుతోంది. రాజమౌలి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన హీరోగా కూడా హిస్టరీ క్రియేట్ అయ్యింది. వీటన్నీంటితో పాటు ఇప్పటి కిప్పుడు తనకి 2 వేల కోట్ల రికార్డు సొంతమయ్యేఛాన్స్ ఉంది. కాని ఆ విషయంలో తను రెండడుగులు వెనక్కి వేస్తున్నాడు

భయంతోనో, కన్ ఫ్యూజన్ తోనో కాదు.. కంప్లీట్ గా కమిట్ మెంట్స్ వల్లే తను ఇలా కలిసొచ్చే 2 వే కోట్ల ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టాల్సి వస్తోంది. తనకే కాదు రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు తనకి ఏకంగా 4 వేల కోట్ల యోగం ఉంది. అది ముందే కన్పామ్అయ్యంది. అయినా తను ఆవిషయంలో ఏది త్వరగా నిర్ణయం తీసుకోవట్లేదు.

ఎన్టీఆర్ విషయానికొస్తే దేవర 2 ఎంత త్వరగా పట్టాలెక్కితే అంత వేగంగా, 2 వేల కోట్ల వసూళ్లొచ్చే ఛాన్స్ ఉంది. దేవర 2నే కాదు కల్కీ 2, సలార్ 2 కి కూడా వసూళ్ల వరద ఎంతొస్తుందో ముందే అంచనా వేయొచ్చు. షూటింగ్ మొదలైతే చాలు ప్రీరిలీజ్ బిజినెస్ 1500 కోట్ల పైనే జరిగే రేంజ్ ఉన్నప్రాజెక్టులు పక్కకు పడుకున్నాయి.

బేసిగ్గా హిట్ మూవీకి సీక్వెల్ వస్తే 1500 కోట్లపైనే వసూలు చేస్తుందని, బాహుబలి 2, పుష్ప2 ప్రూవ్ చేశాయి. అలాంటిది 670 కోట్లు రాబట్టిన దేవరకి సీక్వెల్ వస్తే 2 వేల కోట్లు సునామీకి అవకాశాలెక్కువ. కాని వార్2 పూర్తి చేశాక డ్రాగన్ మూవీకి కమిటవ్వటంతో, అదయ్యే వరకు దేవర2 కి మోక్షం లభించేలా లేదు. ఇక సలార్ 2 పరిస్థితి అదే… ఆల్రెడీ కమిటైన స్పిరిటే జనవరిలోమొదలవ్వాలి..

అదే జరగింది.. ఇక సలార్2 ఎప్పుడు మొదలౌతుంది… ? అయినా డ్రాగన్ పూర్తయ్యాకే సలార్ 2 కి ఛాన్స్ ఉంటుంది. ఈలోపు కల్కీ 2 అయినా పూర్తి చేస్తారా అంటే, నాగ్ అశ్విన్ పూర్తిగా మరో సినిమా ప్లాన్ చేసుకునే పరిస్థితొచ్చింది. ఫౌజీ పూర్తవ్వాలి. స్పిరిట్ మొదలవ్వాలి… ఆతర్వాతే కల్కీ 2 కి మోక్షం.. విచిత్రం ఏంటంటే కల్కీ 1200 కోట్లు రాబట్టిన మూవీ, సలార్ 800 కోట్లు రాబడితే, దేవర 670 కోట్లు రాబట్టింది. సో వీటీలోదేని సిక్వెల్ పట్టాలెక్కినా 1500 కోట్ల నుంచి 2 వేల కోట్ల వసూల్ల సునామీకి ఛాన్స్ ఉంది. కాని ముందే కమిటైన ప్రాజెక్టుల పుణ్యమాని వీటికి మోక్షం దొరకట్లేదు.