అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు మహేష్.. జక్కన్న అల్యూమినియం ఫ్యాక్టరీ సెంటిమెంట్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమా అంటే ఉండే హైప్ వేరే లెవెల్ లో ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా సరే రాజమౌళి టేకింగ్ మాత్రం ఫాన్స్ కు పిచ్చ క్రేజ్ ఇస్తుంది. బాహుబలి సినిమా నుంచి రాజమౌళి సినిమాల కోసం ఇండియా వైడ్ గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 08:21 PMLast Updated on: Jan 02, 2025 | 8:21 PM

Rajamouli And Mahesh Babu Movie Starts

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమా అంటే ఉండే హైప్ వేరే లెవెల్ లో ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా సరే రాజమౌళి టేకింగ్ మాత్రం ఫాన్స్ కు పిచ్చ క్రేజ్ ఇస్తుంది. బాహుబలి సినిమా నుంచి రాజమౌళి సినిమాల కోసం ఇండియా వైడ్ గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు మహేష్ బాబు తో రాజమౌళి ఒక ప్రాజెక్టును లైన్ చేశాడు. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టు మొదలవుతుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ వచ్చారు. ఇక ఫైనల్ గా ఈ ప్రాజెక్టుకు నేడు పూజా కార్యక్రమాలు నిర్వహించి మొదలుపెట్టారు.

ముందు మహేష్ సెట్ కు వచ్చే ఛాన్స్ లేదని అందరూ భావించినా.. పూజా కార్యక్రమాల్లో మహేష్ పాల్గొనడం చూసి ఫ్యాన్స్ షేక్ అయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో స్టార్టింగ్ రోజునే మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ వచ్చింది. అదేంటి అంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్… అవును అల్యూమినియం ఫ్యాక్టరీ విషయంలో రాజమౌళికి ఒక సెంటిమెంట్ ఉందట. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీ లోనే కొంత కంప్లీట్ చేశారు. ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ కీ రోల్ ప్లే చేసింది.

అందుకే ఇప్పుడు కూడా అక్కడే షూటింగ్ మొదలు పెడుతున్నారు. అదే టైంలో రాజమౌళి ఆఫీస్ కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. బాహుబలి కోసం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసినప్పుడు తన ఆఫీస్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని షూటింగ్ లు చేశారు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు. అయితే ఈ సినిమా కోసం దాదాపుగా ఏడాది నుంచి ఇక్కడే పనులు జరుగుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ఆఫ్రికాలో కంప్లీట్ చేయనున్నారు.

కొన్ని రోజుల క్రితం కెన్యాలోని అంబోసిలి నేషనల్ పార్క్ వద్ద మహేష్ బాబు… అలాగే రాజమౌళి షూటింగ్ స్పాట్లను పరిశీలించారు. లొకేషన్ రెక్కీ నిర్వహించి పక్క ప్లానింగ్ తో దిగారు. ఇక రాజమౌళితో పాటుగా ఆయన కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ కూడా అక్కడే తిరిగాడు. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఆఫ్రికాలో ప్లాన్ చేస్తున్నారు. కెన్యా తో పాటుగా సౌత్ ఆఫ్రికాలో కూడా వైల్డ్ లైఫ్ సఫారీల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కే. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై… ఇప్పటికే అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇక అల్యూమినియం ఫ్యాక్టరీ సెంటిమెంట్ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కు పిచ్చ క్రేజీస్తోంది. అక్కడే ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా జరగడం ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు సినిమాపై కూడా అదే రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఇక రాజమౌళి కూడా ఆ సినిమా విషయంలో జరిగిన మిస్టేక్స్ ఈ సినిమాలో జరగకూడదని ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన క్రేజీ అప్డేట్ కూడా రిలీజ్ కానుంది.