Mahesh Jakkanna : మహేష్‌ని అరెస్ట్‌ చేసిన రాజమౌళి!

రాజమౌళి ఒక సినిమా మొదలుపెట్టాడంటే అందరి దృష్టీ దానిపైనే ఉంటుంది. ఆ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ ఏమిటి ప్రీ ప్రొడక్షన్‌లో ఏం జరుగుతోంది సినిమా కోసం ఎలాంటి సెట్స్‌ వేస్తున్నారు సినిమాని ఎక్కడెక్కడ ప్లాన్‌ చేశారు ఈసారి రాజమౌళి సినిమాలో హీరో ఎలా ఉండబోతున్నాడు. ఇలాంటి ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2024 | 03:23 PMLast Updated on: Feb 11, 2024 | 3:23 PM

Rajamouli Arrested Mahesh

రాజమౌళి ఒక సినిమా మొదలుపెట్టాడంటే అందరి దృష్టీ దానిపైనే ఉంటుంది. ఆ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ ఏమిటి ప్రీ ప్రొడక్షన్‌లో ఏం జరుగుతోంది సినిమా కోసం ఎలాంటి సెట్స్‌ వేస్తున్నారు సినిమాని ఎక్కడెక్కడ ప్లాన్‌ చేశారు ఈసారి రాజమౌళి సినిమాలో హీరో ఎలా ఉండబోతున్నాడు. ఇలాంటి ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉంటాయి. రాజమౌళి ఈ సినిమా ఎనౌన్స్‌ చేసిన రోజునే మహేష్‌బాబు లాక్‌ అయిపోయాడు. బాహుబలి (Bahubali) ఐదేళ్ళు, ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) మూడేళ్ళు.. ఈ సినిమాల షూటింగ్‌ ప్రారంభం కావడానికి ముందు ప్రభాస్‌, రానా, ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌ (Ram Charan)ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు.

ఈ సినిమా కోసం మహేష్‌ని రాజమౌళి ఎన్నేళ్ళు అరెస్ట్‌ చేస్తాడో తెలీదు. అయితే షూటింగ్‌ ప్రారంభానికి ముందే రాజమౌళి కొన్ని నెలలపాటు వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నాడు. ఓ పక్క మహేష్‌ లుక్‌ (Mahesh look) మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు రాజమౌళి. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియానా జోన్స్‌ తరహాలో సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి అలాంటి సినిమాలో హీరో ఎలా ఉండాలి అనే దానికి ఒక ఫార్ములా ఉంది. దాని ప్రకారమే మహేష్‌కి హాలీవుడ్‌ (Hollywood) స్టార్‌ హీరో లుక్‌ తీసుకురాబోతున్నారు. అది వెంటనే సాధ్యపడదన్న విషయం తెలిసిందే. ఇంకా చాలా నెలలు మహేష్‌ భారీ వర్కవుట్‌ చెయ్యాల్సి ఉంటుంది.

దీని కోసం మహేష్‌ కఠోర శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందట. రాజమౌళితో సినిమా చెయ్యాలంటే ఎంతటి పెద్ద హీరో అయినా అతను చెప్పింది వినాల్సిందే. నెలల తరబడి ఫిట్‌నెస్‌ విషయంలో, యాక్టింగ్‌ పరంగా శిక్షణ తీసుకోవాల్సిందే. ఈ సినిమా కోసం కొన్ని నెలలు భారీ వర్క్‌షాప్‌లు, రిహార్సల్స్‌ నిర్వహించేందుకు అందర్నీ సన్నద్ధం చేస్తున్నాడు రాజమౌళి. ఇందులో ఆర్టిస్టులతోపాటు యూనిట్‌లోని అందరూ పాల్గొంటారు.