Rajamouli : మహేష్ బాబు సినిమా అయ్యేలోపు హీరోగా రాజమౌళి

ప్రస్తుతం దర్శకధీరుడు రాజ‌మౌళి (Rajamouli) క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ కొట్టి హిస్టరీ క్రియేట్ చేసిన జక్కన్న..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2024 | 10:36 AMLast Updated on: Apr 12, 2024 | 10:36 AM

Rajamouli As A Hero Before Mahesh Babus Movie

ప్రస్తుతం దర్శకధీరుడు రాజ‌మౌళి (Rajamouli) క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ కొట్టి హిస్టరీ క్రియేట్ చేసిన జక్కన్న.. నెక్స్ట్ సూపర్ స్టార్ (Super star) మహేష్ బాబు (Mahesh Babu) తో హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈలోపు రాజమౌళినే హీరోగా మారేలా ఉన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానికి కారణం ఒక వైరల్ డ్యాన్స్ వీడియో అనే చెప్పాలి.

రీసెంట్‌గా ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో డ్యాన్స్‌ చేశాడు రాజమౌళి. ప్రేమికుడు సినిమాలోని ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..’ పాటకు రమ, రాజమౌళి ఇద్దరు స్టెప్పులేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రాజ‌మౌళిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయారు.

ఇక లేటెస్ట్‌గా ఆ డాన్స్‌కు సంబంధించిన రిహార్సల్‌ వీడియో ఒకటి బయటికొచ్చి వైరల్‌గా మారింది. రాజ‌మౌళి దంపతులతో పాటు మరికొందరు కొరియోగ్రాఫర్ సమక్షంలో రిహార్సల్‌ చేశారు. ఇక ఈ రిహార్సల్ వీడియో చూసిన తర్వాత.. రాజమౌళి డ్యాన్స్‌కు ఎవ్వరైనా ఫిదా అవాల్సిందే. దర్శకధీరుడు తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి వావ్ అనిపించాడు. దీంతో కొందరు నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఏ పని చేసిన జక్కన్న పర్ఫెక్ట్‌గా చేస్తాడని.. రాజ‌మౌళి మామూలోడు కాదు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. మహేష్ బాబు సినిమా కంప్లీట్ అయ్యేలోపు రాజమౌళి హీరోగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదని కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు.. రాజమౌళి డ్యాన్స్ చేసింది మైత్రి మూవీ మేకర్స్‌ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహంలో అని తెలుస్తోంది. ఏదేమైనా.. జక్కన్న అంటే ఆ మాత్రం ఉంటది మరి.