నమ్రతా పెత్తనానికి రాజమౌళి బ్రేక్…? సెట్ అవ్వదన్న జక్కన్న…!

ఎవరెన్ని మాట్లాడినా దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఆయన చెప్పిందే ఫైనల్ అనే మాట ఆయనతో సినిమా చేసిన హీరోలు అందరికి ఒక క్లారిటీ ఉంటుంది. ఆయన ఏదైనా ఒక సీన్ ని రీ షూట్ చేయాలంటే చేయాల్సిందే, లుక్ ఇలా ఉండాలి అంటే అలా ఉండాల్సిందే...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2024 | 12:15 PMLast Updated on: Sep 09, 2024 | 12:15 PM

Rajamouli Break For Namrata Petthan Jakkana That Doesnt Set

ఎవరెన్ని మాట్లాడినా దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఆయన చెప్పిందే ఫైనల్ అనే మాట ఆయనతో సినిమా చేసిన హీరోలు అందరికి ఒక క్లారిటీ ఉంటుంది. ఆయన ఏదైనా ఒక సీన్ ని రీ షూట్ చేయాలంటే చేయాల్సిందే, లుక్ ఇలా ఉండాలి అంటే అలా ఉండాల్సిందే… జుట్టు పెంచాలి అంటే పెంచాల్సిందే, గుండుతో కనపడమంటే కనపడాల్సిందే. సినిమా విషయంలో జక్కన్న అంత పక్కాగా ఉంటాడు కాబట్టే సినిమాలు హిట్ అవుతూ వస్తున్నాయి. స్క్రీన్ ప్లే సిద్దం చేసుకునే సమయంలోనే హీరో లుక్ ని ఆయన ఊహించుకుంటారట.

ఏ సీన్ లో ఏ కాస్ట్యూమ్ ఉండాలో కూడా ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. ఆయన ఆలోచనకు తగ్గట్టుగానే ఆయన టీం పని చేస్తుంది. లుక్స్ విషయంలో జక్కన్న బాహుబలి సినిమా తర్వాత చాలా జాగ్రత్త పడుతున్నాడు అనే విషయం ఆర్ఆర్ఆర్ సినిమాలో క్లియర్ గా అర్ధమైంది. ఇప్పుడు మహేష్ బాబుతో ఆయన సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేస్తారు. ఇప్పుడు మహేష్ బాబుని తన సినిమాకు తగ్గట్టుగా జక్కన్న మార్చే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే ఇక్కడ ఆయనకు ఒక సమస్య వచ్చింది. మహేష్ బాబు సినిమాల విషయంలో ఆయన సతీమణి నమ్రత చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఏ సినిమా చేసినా సరే మహేష్ ను ఎలా చూపించాలో అలాగే చూపిస్తున్నారు ఆమె. మహేష్ లుక్, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఆమెనే ఫైనల్ చేస్తున్నారు. అలానే ఈ సినిమాకు కూడా చేయాలని నమ్రత చూస్తే జక్కన్న ఒప్పుకోలేదట. తన భార్య రమా రాజమౌళి ఫైనల్ చేస్తారని చెప్పారట. ఇక కాస్ట్యూమ్స్ విషయంలో నమ్రత చెప్పిన అభిప్రాయాలను తీసుకుంటా అని… కాని తాను కాంప్రమైజ్ కాలేను అని మహేష్ కి జక్కన్న క్లారిటీ ఇచ్చారట. దీనికి మహేష్ కూడా ఓకే చెప్పారట.