రాజమౌళి క్రేజీ అప్డేట్, కమిట్ అయిన మహేష్, సినిమా పిచ్చోళ్ళకు పండగే
టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ కాంబినేషన్ అంటే మహేష్ బాబు.. రాజమౌళి. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం దాదాపు 10 ఏళ్ల నుంచి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ కాంబినేషన్ అంటే మహేష్ బాబు.. రాజమౌళి. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం దాదాపు 10 ఏళ్ల నుంచి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ సినిమా పిచ్చోళ్ళకు కూడా వీళ్ళ కాంబినేషన్ అంటే ఒక క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు జనాలు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా షూటింగ్ కూడా రెడీ అయిపోతుంది. త్వరలోనే హైదరాబాదులో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక సెట్లో సినిమా షూట్ స్టార్ట్ అవుతుందని ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు వస్తున్న ఒక న్యూస్ ప్రకారం సినిమా షూటింగ్ ఆఫ్రికాలో స్టార్ట్ అవ్వడానికి రెడీ అయిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులపై బిజీబిజీగా ఉంది. ఇక లేటెస్ట్ గా రాజమౌళి ఒక ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. సింహాన్ని లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో రిలీజ్ చేశారు. పాస్పోర్ట్ చూపిస్తూ ఫోటోకు ఫోజు కూడా ఇచ్చారు రాజమౌళి. దీనితో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లే అని అభిమానులు అనుకుంటున్నారు. 2026 జనవరి కి ఎలాగైనా సరే ఈ సినిమా రిలీజ్ చేయాలని రాజమౌళి కూడా పట్టుదలగా ఉన్నారు.
గతంలో మాదిరిగా సినిమాలు విషయంలో ఆలస్యం చేయకుండా ఈ సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక ఈ వీడియోకు రాజమౌళి క్యాప్చర్ అనే క్యాప్షన్ పెట్టారు. దీనికి మహేష్ బాబు అలాగే ప్రియాంక చోప్రా ఇద్దరు రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననంటూ పోకిరి డైలాగును మహేష్ బాబు కామెంట్ చేశారు. ఇక మొత్తానికి షూటింగ్ ప్రారంభమైంది అని అర్థం వచ్చేలా ప్రియాంక చోప్రా కూడా కామెంట్ చేశారు. ఫైనల్లీ అంటూ నవ్వుతున్న ఎమోజిని కూడా ఆమె షేర్ చేశారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో ఆమె సినిమాలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రియాంక లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్ వచ్చేసారు. దీనితో ఈ ప్రాజెక్టు కోసమే వచ్చారని కామెంట్స్ కూడా వినిపించాయి. తాజాగా రాజమౌళి వీడియోకు ప్రియాంక కామెంట్ పెట్టడంతో ఇందులో మహేష్ పక్కన ప్రియాంక ఫైనల్ అయిపోయారని అనుకుంటున్నారు జనాలు. ఇప్పటికే ఆమెకు లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసినట్లు టాక్. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటుగా విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తారు. ఇక ఈ సినిమాకు గరుడ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో త్రిబుల్ ఆర్ కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని రాజమౌళి కామెంట్ చేశారు. విదేశీ యాక్టర్స్ ను కూడా ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.