మహేష్ కు వాటాల్లేవా…? రెమ్యునరేషన్ ఫైనల్…?

రాజమౌళితో ఏ స్టార్ హీరో సినిమా చేసినా జక్కన్న చెప్పింది వినడమే అంటూ ఉంటారు. ఆయనతో సినిమా అంటే కచ్చితంగా ఆయన పెట్టుకున్న రూల్స్ అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సినిమా తనకు నచ్చినట్టు చేసే జక్కన్న కొన్ని విషయాల్లో ఎక్కడా వెనకడుగు వేయరు అంటూ ఉంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 9, 2024 | 07:12 PMLast Updated on: Oct 09, 2024 | 7:12 PM

Rajamouli Fix Mahesh Babu Remunaration

రాజమౌళితో ఏ స్టార్ హీరో సినిమా చేసినా జక్కన్న చెప్పింది వినడమే అంటూ ఉంటారు. ఆయనతో సినిమా అంటే కచ్చితంగా ఆయన పెట్టుకున్న రూల్స్ అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సినిమా తనకు నచ్చినట్టు చేసే జక్కన్న కొన్ని విషయాల్లో ఎక్కడా వెనకడుగు వేయరు అంటూ ఉంటారు. ఇక సినిమాల రెమ్యునరేషన్ విషయంలో కూడా జక్కన్న ఓ లెక్క ఫాలో అవుతూ ఉంటారు ముందు నుంచి. ఆయన ఏ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు కేవలం లాభాల్లో వాటా మాత్రమే తీసుకుంటూ ఉంటారని అంటూ ఉంటారు.

ముఖ్యంగా బాహుబలి సినిమా నుంచి ఇది కాస్త ఎక్కువైంది. ఇక సినిమాల్లో పెట్టుబడి కూడా జక్కన్న పెడుతూ ఉంటారనే టాక్ ఉంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో కూడా జక్కన్న అదే ఫాలో అవుతున్నారు. ఈ సినిమాలో దాదాపు వంద కోట్ల వరకు జక్కన్న పెట్టుబడి ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంతే కాకుండా ఆయన లాభాల్లో వాటా తీసుకుంటా అని కూడా చెప్తున్నారట. దీనికి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మహేష్ బాబు విషయంలో మాత్రం కాస్త భిన్నంగా నిర్మాతలు ఫిక్స్ చేసినట్టు సమాచారం.

మహేష్ బాబు గత సినిమాల్లో రెమ్యునరేషన్ తీసుకోకుండా కేవలం లాభాల్లో వాటా తీసుకునే వాడు. ఈ సినిమాకు కూడా అలాగే తీసుకోవాలని సూపర్ స్టార్ భావించగా దానికి జక్కన్న నో చెప్పారట. రెమ్యునరేషన్ తీసుకోవాలని లాభాల్లో వాటా డైరెక్టర్, హీరో ఇద్దరూ తీసుకుంటే నిర్మాతలు ఇబ్బంది పడతారని మహేష్ ను కన్విన్స్ చేసినట్టు సమాచారం. రాజమౌళి కూడా పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి స్వయంగా మహేష్ ను ఆయనే కన్విన్స్ చేసారట. దీనికి మహేష్ బాబు కూడా ఓకే చెప్పారని టాక్.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్తున్నా ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. రాజమౌళి చెప్పే డేట్ కి సినిమా విడుదల చేసే టైం కి అసలు సంబంధం ఉండదు. ప్రతీ ఒక్కటి లెక్కతో వెళ్ళే జక్కన్న… సినిమాలో తనకు నచ్చకపోతే రీ షూట్ చేస్తూ ఉంటారట. ఎవరు ఇబ్బంది పడినా ఈ విషయంలో ఆయన మాత్రం వెనక్కు తగ్గే ఛాన్స్ ఉండదు అంటున్నాయి సినీ వర్గాలు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో బాహుబలి రెండు పార్ట్ ల విషయంలో ఇదే జరిగింది. ఆ రెండు సినిమాలు అందుకే పదేళ్ళ సమయం తీసుకున్నాయి. మరి మహేష్ బాబు సినిమా ఎన్నాళ్ళు తీసుకుంటుందో చూడాలి.