రాజమౌళి సెంటిమెంట్ తప్పించలేరా…?

టాలీవుడ్ లో రాజమౌళి సినిమాలంటే జనాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జక్కన్న సినిమాలు ఇప్పటి వరకు లెక్క తప్పలేదు. ఆలస్యం అవుతాయనే టాక్ మినహా ఏ ఇబ్బంది లేదు ఆయన సినిమాలకు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 27, 2024 | 04:07 PMLast Updated on: Sep 27, 2024 | 4:07 PM

Rajamouli Flop Sentiment Coninue With Devara

టాలీవుడ్ లో రాజమౌళి సినిమాలంటే జనాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జక్కన్న సినిమాలు ఇప్పటి వరకు లెక్క తప్పలేదు. ఆలస్యం అవుతాయనే టాక్ మినహా ఏ ఇబ్బంది లేదు ఆయన సినిమాలకు. మొదటి సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు అసలు ఫ్లాప్ అనే మాట తెలియని డైరెక్టర్ ఆయన. అక్కడి వరకు సూపర్ డూపర్ గాని… జనాలకు ఓ రేంజ్ లో మండిపోతుంది ఇప్పుడు. నీకో దండం మా హీరోలతో సినిమాలు చేయకు బాబూ అంటూ వేడుకునే పరిస్థితి వచ్చింది ఫ్యాన్స్ కి.

రాజమౌళితో సినిమా సూపర్ హిట్ అయినా ఆ తర్వాత హీరోలు చేసే సినిమాలు ఫ్లాప్. దారుణంగా ఫ్లాప్, సినిమా కథ ఎంత బాగా రాసుకున్నా, ఏ హీరోని ఎంపిక చేసుకున్నా… విజయం మాత్రం వరించే ఛాన్స్ దరిదాపుల్లో కూడా కనపడటం లేదు. ఇప్పుడు దేవర పరిస్థితి కూడా అదే అంటున్నారు జనాలు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ళ పాటు గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ దేవర సినిమా పూర్తి చేసాడు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. రోజులు గంటలు లేక్కపెట్టారు జనాలు.

సినిమా విడుదల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసారు ఫ్యాన్స్. తీరా చూస్తే సినిమా దారుణంగా ఉందనే టాక్ వస్తోంది. సినిమాలో పెద్దగా ఆకట్టుకునేవి ఏమీ లేవని పెదవి విరుస్తున్నారు. సినిమా చూడక ముందే బయటకు వచ్చేస్తున్నారు కొందరు. దీనితో రాజమౌళి సెంటిమెంట్ ని తప్పించడం ఎవరి తరం కాదంటున్నారు జనాలు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య ఫ్లాప్ తో రామ్ చరణ్ బయటపడ్డాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కు కీలకమైన దేవర దెబ్బకొట్టింది. దేవర సినిమాపై ఉన్న అంచనాలకు సినిమాలో చూపించిన దానికి ఏ మాత్రం సంబంధం లేదని, టైం తీసుకుని కూడా నాశనం చేసారు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు.