మహేష్ బాబుకు విడుదల.. పాస్ పోర్ట్ ఇచ్చిన రాజమౌళి.. వైరల్ అవుతున్న వీడియో..!

SSMB29 షూటింగ్ మొదలవ్వక ముందు రాజమౌళి పోస్ట్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. మహేష్ బాబును జైల్లో వేసి పాస్ పోర్ట్ తాను లాగేసుకున్నాను అంటూ జక్కన్న పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 5, 2025 | 02:00 PMLast Updated on: Apr 05, 2025 | 2:00 PM

Rajamouli Gives Mahesh Babu A Passport After Being Released Video Goes Viral

SSMB29 షూటింగ్ మొదలవ్వక ముందు రాజమౌళి పోస్ట్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. మహేష్ బాబును జైల్లో వేసి పాస్ పోర్ట్ తాను లాగేసుకున్నాను అంటూ జక్కన్న పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఇక ఈ సినిమా అయిపోయేంతవరకు మహేష్ బాబుకు ఫ్యామిలీ ట్రిప్స్ లేవు ఉండవు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఎందుకో తెలియదు మరి మహేష్ కోసం తన పద్ధతులు మార్చుకుంటున్నాడు రాజమౌళి. సూపర్ స్టార్ కు ట్రిప్ వెళ్లడానికి పర్మిషన్ వచ్చేసింది. మహేష్ ఏం మాయ చేసాడో తెలియదు కానీ పాస్ పోర్ట్ తిరిగి ఇచ్చేసాడు రాజమౌళి. మామూలుగానే ఏ సినిమా చేసినా.. ఏ దర్శకుడితో పని చేసినా.. ఏడాదికి కనీసం రెండు మూడుసార్లు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లి రావడం మహేష్ బాబుకి అలవాటు. పిల్లలకు హాలిడేస్ దొరికాయ్ అంటే చాలు వెంటనే వెకేషన్ ప్లాన్ చేయడం సూపర్ స్టార్ స్పెషాలిటీ. అయితే ఇంతకుముందు చేసినట్టు ఇప్పుడు చేయడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజమౌళి సినిమా చేస్తున్నాడు.

ఇష్టం వచ్చినట్టు.. హాలిడేస్ తీసుకుంటాను.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళొస్తాను అంటే రాజమౌళితో వర్కౌట్ అవ్వదు. ఒకసారి ఆయన సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత.. అక్కడంతా జక్కన్న రూల్ నడుస్తుంది. ఆయన చెప్పిందే జరగాలి..! మహేష్ బాబుకు కూడా ఇవే కండిషన్స్ అప్లై అవుతున్నాయి. షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు మహేష్ ను బయట చూసింది లేదు. మొన్న దుబాయ్ లో జరిగిన ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ కు కూడా నమ్రత మాత్రమే వెళ్ళింది. దీన్ని బట్టి సూపర్ స్టార్ కూడా రాజమౌళి జైల్లో బంధీ అయిపోయాడని అర్థమవుతుంది. అయితే బాగా బయట తిరిగిన ప్రాణం కదా.. అలా ఒక్కచోటే ఉండాలంటే ఉండలేకపోతున్నాడు మహేష్. అందుకే రాజమౌళికి లీవ్ లెటర్ పెట్టుకుంటున్నాడు మహేష్. ఒక్కసారి ఆలోచించండి మహాప్రభో.. ఈ సమ్మర్లో నేను ఒక ఫ్యామిలీ ట్రిప్ వెళ్లాలి అనుకుంటున్నాను.. దయచేసి నాకు కొన్ని రోజులు లీవ్ సాంక్షన్ చేయండి అంటున్నాడు.

మరి మహేష్ పెట్టుకున్న అర్జీని రాజమౌళి పట్టించుకున్నాడు. ముందు నుంచి మిగిలిన హీరోలతో పోలిస్తే మహేష్ కు కాస్త రిలీఫ్ ఉంది. ఈ సినిమా షూటింగ్ కేవలం ఏడాదిలోనే పూర్తి చేస్తాను అంటున్నాడు రాజమౌళి. అందుకే ఫ్యామిలీ ట్రిప్ కోసం పర్మిషన్ కూడా ఇచ్చేశాడు దర్శక ధీరుడు. ఎయిర్ పోర్టులో తన పాస్ పోర్ట్ చూపిస్తూ కూతురు సితారతో కలిసి మహేష్ బాబు వెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇదిగోండి నా పాస్ పోర్ట్ అంటూ మీడియాకు చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు సూపర్ స్టార్. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం చిన్న బ్రేక్ లో ఉన్నాడు రాజమౌళి. మొన్నటి వరకు ఒరిస్సాలోని డియోమాలి, తలమాలి, కళ్యమాలి అటవీ ప్రాంతంలో షూటింగ్ చేశాడు జక్కన్న. నెక్స్ట్ షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నాడు. ఆలోపు ఒక ట్రిప్ వెళ్లి రానున్నాడు మహేష్. వచ్చాక మళ్ళీ నాన్ స్టాప్ షెడ్యూల్స్ ఉండబోతున్నాయి.