మహేష్ సినిమా చూసి కోపంతో రగిలిపోయిన రాజమౌళి.. చేతిలో ఉన్న బుక్ చించేసాడంట..!
అదేంటి.. ప్రస్తుతం మహేష్ బాబుతోనే కదా రాజమౌళి సినిమా చేసేది..! మరి మహేష్ సినిమా చూసి రాజమౌళి కోపంతో పగిలిపోతున్నాడు అంటూ థంబ్ నెయిల్ పెట్టారు ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదా..!

అదేంటి.. ప్రస్తుతం మహేష్ బాబుతోనే కదా రాజమౌళి సినిమా చేసేది..! మరి మహేష్ సినిమా చూసి రాజమౌళి కోపంతో పగిలిపోతున్నాడు అంటూ థంబ్ నెయిల్ పెట్టారు ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదా..! ఇక్కడే ఉంది అసలు కథ..! దీని వెనక స్టోరీ తెలియాలంటే మనం ఒక 13 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు అపజయం అంటూ జరగని దర్శకుడు రాజమౌళి మాత్రమే. అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు కానీ ఎఫ్3 యావరేజ్ దగ్గర ఆగిపోవడంతో.. రాజమౌళి ఈ లిస్టులో ముందున్నాడు. దాంతో అప్పట్లో ఒక సినిమా సక్సెస్ ఎలా అవుతుంది.. దాని ఫార్ములా ఏంటి అని ఒక బుక్ రాసాడు దర్శక ధీరుడు. వరుస విజయాలు అందుకుంటున్నాడు కాబట్టి జనాల నాడి తనకు తెలిసింది అనుకుని ఒక పుస్తకం రాసాడు జక్కన్న. అందులో ఒక సినిమా ఎలా తీయాలి.. ఎలా తీస్తే హిట్ అవుతుంది.. కథ ఎలా రాసుకుంటే జనాలకు నచ్చే అవకాశం ఉంది.. హీరో క్యారెక్టర్ ఎలా ఉండాలి.. ఇలా ఎన్నో విషయాలు అందులో రాశాడు.
దాన్ని విడుదల చేయాలి అనుకున్నాడు కూడా. కానీ సరిగ్గా అదే సమయంలో మహేష్ బాబు సినిమా ఒకటి రిలీజ్ అయింది. అది చూసిన తర్వాత తన బుక్కు ఎంత తప్పు అనేది రాజమౌళికి అర్థం అయింది. దాంతో బయటకు రాకుండానే ఆ బుక్ ని తీసి కోపంతో చించి అవతల పారేశాడు. రాజమౌళికి జ్ఞానోదయం కలిగించిన ఆ మహేష్ బాబు సినిమా ఏదో కాదు బిజినెస్ మాన్. 2012లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. కేవలం 60 రోజుల్లోనే ఈ సినిమా తీశాడు పూరి జగన్నాథ్. అప్పటికే దూకుడు సినిమాతో మంచి ఊపు మీద ఉన్న మహేష్.. సంక్రాంతికి వచ్చి మరో సక్సెస్ అందుకున్నాడు. బిజినెస్ మాన్ చూసిన తర్వాత రాజమౌళికి చుక్కలు కనిపించాయి. అందులో హీరో క్యారెక్టర్ నెగటివ్ గా ఉంటుంది.. బూతులు మాట్లాడుతుంది.. ఆడపిల్లను కొడుతుంది.. మామూలుగా అయితే ఒక సినిమాలో ఒక స్టార్ హీరో ఇవన్నీ చేయడు.. చేస్తే ఆడియన్స్ ఒప్పుకోరు అని బలంగా నమ్మే దర్శకుడు రాజమౌళి. కానీ బిజినెస్ మెన్ సినిమాలో హీరోతో ఇవన్నీ చేయించి హిట్టు కొట్టాడు పూరి జగన్నాథ్. దాంతో జక్కన్నకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.
అసలు ఓ సినిమా సక్సెస్ ఫార్ములా ఏంటి అనేది ఎవరికి తెలియదు.. సినిమా ఎలా ఉన్నా.. అందులో హీరో క్యారెక్టర్ ఎలా ఉన్నా ఆడియన్స్ ఒప్పుకుంటే అది హిట్ అవుతుందని బిజినెస్ మాన్ సినిమా నిరూపించింది. దాంతో తన అంచనా తప్పు అని తను రాసిన బుక్కు చించేసాడు రాజమౌళి. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు ఆయనతో రోజు షటిల్ ఆడే ఒక స్నేహితుడు. నిజానికి బిజినెస్ మాన్ ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు.. పూరి జగన్నాథ్ ను ఆకాశానికి ఎత్తేశాడు రాజమౌళి. తాను ఒక సినిమా చేయడానికి రెండు సంవత్సరాలు తీసుకుంటుంటే.. మూడు నెలల్లో మహేష్ బాబు లాంటి హీరోతో పూరి సినిమా చేస్తున్నాడని.. అది చూసి తమకు ఇంట్లో తిట్లు పడుతున్నాయని చెప్పాడు రాజమౌళి. పూరీ జగన్నాథ్ దగ్గరికి వెళ్లి సినిమాలు ఫాస్ట్ గా ఎలా తీయాలి అనే విషయంపై శిక్షణ తీసుకోవాలి అంటూ ఇంట్లో చెప్తున్నారు అంటూ తనమీద తనే సెటైర్ వేసుకున్నాడు రాజమౌళి. అలా బిజినెస్ మాన్ సినిమాతో దర్శక ధీరుడికి చాలా జ్ఞానోదయాలు అయ్యాయి.