Ram Charan: రాజమౌళి ఇండియన్‌ స్పీల్‌ బర్గ్.. జక్కన్నను ఆకాశానికెత్తిన చరణ్‌

ఆస్కార్‌ అవార్డ్స్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నాడు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. పలు టీవీ చానెల్స్‌, రేడియోస్‌, మేగజైన్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్టింగ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు రామ్‌ చరణ్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2023 | 06:30 PMLast Updated on: Mar 09, 2023 | 6:30 PM

Rajamouli Is Indian Speilberg Ram Charan Praises

ఆస్కార్‌ అవార్డ్స్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నాడు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. పలు టీవీ చానెల్స్‌, రేడియోస్‌, మేగజైన్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. రీసెంట్‌గా ఓ పాడ్‌కాస్టింగ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు రామ్‌ చరణ్‌. సినిమా విషయంలో రాజమౌళి ఎంత పర్ఫెక్షన్‌ మొయిన్‌టేన్‌ చేస్తాడో వివరించాడు. ప్రాజెక్ట్‌ షూటింగ్‌లో ఉన్నప్పుడు రాజమౌళికి వేరే ప్రపంచం ఉండదని.. ఆయన ఇండియన్‌ స్పీల్‌బర్గ్‌ అంటూ జక్కన్నను ఆకాశానికెత్తేశాడు. రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు స్టార్‌ హీరోలు కూడా క్యూ కడతారంటూ చెప్పాడు. సినిమాలో పని చేసే ప్రతీ ఆర్టిస్టును రాజమౌళి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్పాడు.

కొవిడ్‌ సమయంలో వాళ్ల మధ్య జరిగిన ఓ సంఘటనను వివరించాడు. కొవిడ్‌ కారణంగా ట్రిపులార్‌ సినిమా షూటింగ్‌ కొన్ని రోజులు వాయిదా పడింది. ఆ సమయంలో ఓ సారి రాజమౌళి రామ్‌ చరణ్‌కు ఫోన్‌ చేశాడట. ఎలా ఉన్నావ్‌ అంటూ చాలా ప్రేమగా మాట్లాడాడట. అన్ని జాగ్రత్తలూ చెప్తూ.. జిమ్‌ విషయంలో అసలు కాంప్రమైజ్‌ కావొద్దని చెప్పాడట. రాజమౌళి తన సినిమాలోని హీరోలకు ఎలాంటి ప్రియారిటీ ఇస్తాడో చెప్పేందుకు ఈ ఒక్క ఎగ్జాంపుల్‌ చాలని జక్కన్నపై తన అభిమానాన్ని చాటుకున్నాడు చరణ్‌. రీషూట్‌ విషయంలో ఇబ్బంది అనిపించినా.. ఫైనల్‌ రిజల్ట్‌ చూశాక ఆ కష్టం మొత్తం మర్చిపోయేలా రాజమౌళి సినిమాలు ఉంటాయని చెప్పాడు.

అటు జూనియర్‌ ఎన్టీఆర్‌తో కూడా తనకు మంచి స్నేహం ఉందని చెప్పాడు చెర్రీ. కేవలం సినిమా పరంగానే కాకుండా చాలా ఏళ్లుగా తాము మంచి ఫ్రెండ్స్‌ అని చెప్పాడు. నిజానికి వాళ్లిద్దరి మధ్య ఉన్న అఫెక్షన్‌ కారణంగానే.. సినిమాలో రామ్‌, భీమ్‌ క్యారెక్టర్లు ఆ రేంజ్‌లో సక్సెస్‌ అయ్యాయని చెప్పాడు.