1000 కోట్లు… 1000 కోట్లు… కాని నిజం మాత్రం చెరో 50 కోట్లు..

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు. రీసెంట్ గా సినిమా లాంచైంది. సినిమా కంటెంట్ కాని, డిటేల్స్ కాని లీక్ కాకూడదని అగ్రిమెంట్ కూడా సైన్ చేయించాడు రాజమౌళి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2025 | 08:46 PMLast Updated on: Jan 30, 2025 | 8:46 PM

Rajamouli Is Making Panworld Movie With Superstar Mahesh Babu

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు. రీసెంట్ గా సినిమా లాంచైంది. సినిమా కంటెంట్ కాని, డిటేల్స్ కాని లీక్ కాకూడదని అగ్రిమెంట్ కూడా సైన్ చేయించాడు రాజమౌళి. ఇంత చేస్తే ఈ మూవీ కోసం హాలీవుడ్ నుంచి వచ్చిన ప్రియాంక చోప్రా తీసుకునేది 20 కోట్లు… సూపర్ స్టార్ మహేశ్ బాబుకి దక్కేది 50 కోట్లు.. తను గుంటూరు కారానికే 120 కోట్లు తీసుకున్నాడన్నారు. అలాంటిది ఇంత పెద్ద పాన్ వరల్డ్ మూవీకి కేవలం 50 కోట్లే తీసుకుంటాడా? అది కూడా రెండు మూడేళ్లు పూర్తిగా తన డేట్లన్నీ ఈ ఒక్క మూవీకే సమర్పించి…? ఇది కామన్ గా ఎవరికైనా వచ్చే డౌటే.. కాకపోతే ఇది నిజం కూడా.. విచిత్రం ఇక్కడ మరో నిజం ఉంది… అదేంటంటే ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు… ఈ మూవీకి మహేశ్ తీసుకునేది వెయ్యికోట్లు.. ఇక రాజమౌళి కూడా ఈ సినిమా తో థౌజెండ్ వాలాగా మారుతున్నాడు.. ఇవన్నీ నిజాలే అయితే 50 కోట్లు మహేశ్ బాబు, 20 కోట్ల ప్రియాంక చోప్రా అన్నమాటలకు అర్ధమేంటి? అక్కడే ట్విస్ట్ ఉంది… అదేంటో చూసేయండి.

గోల్డ్, మహారాజా , ఇవన్నీ మహేవ్ బాబుతో, రాజమౌళి ప్లాన్ చేసిన పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం అనుకున్న టైటిల్లు.. ఏది కన్ఫామ్ కాలేదు. కాని ఈలోపు ఈమూవీకి రెమ్యునరేషన్ గా ప్రియాంక చోప్రా 20 కోట్లు తీసుకుంటోందన్న వార్త వైరలైంది. తను బాలీవుడ్ లో మూవీస్ చేస్తున్నప్పుడే 25 కోట్లకు తక్కువ తీసుకోలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో జంజీర్ అలియాస్ తుఫాన్ చేసినప్పుడే 20 కోట్లు రెమ్యునరేషన్ తో పాటు,ముంబై రైట్స్ కూడా ఇచ్చారు. తనకంటూ సోలో సాంగ్ పెట్టారు.

అలాంటిది హాలీవుడ్ లో టాప్ యాక్షన్ సీరీస్ తో ఫోకస్ అయ్యింది. అక్కడికెళ్లాక సినిమాలతోనే కాదు, పాప్ సింగర్ నిక్ జోనస్ తో ఏడడుగులు నడిచింది. ఇటు ప్రొఫేషనల్ గా, అటు పర్సనల్ గా చాలా రిచ్ గా సెటిలైంది. అలాంటి తను యూఎస్ నుంచి 20 కోట్ల రెమ్యునరేషన్ కోసం రాజమౌళి సినిమా ఒప్పుకుంటుందా? అక్కడే కథ లో ట్విస్ట్ ఉంది.

తనకే కాదు, త్రిబుల్ ఆర్ హిట్టయ్యాక 200 కోట్లు తీసుకున్న రాజమౌళి కూడా, మహేశ్ మూవీకి 50 కోట్లే తీసుకుంటున్నాడు. గుంటూరు కారానికి 120 కోట్లు దక్కించుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా 50 కోట్లతో సరిపెట్టుకుంటున్నాడు. దానికి సాలిడ్ రీజనుంది. నిజానికి ప్రియాంకకి ఇస్తున్న 20 కోట్లు, మహేశ్, రాజమౌళికి ఇస్తున్న 50 కోట్లు.. ఇవేవి వీళ్లకు దక్కిన పూర్తి రెమ్యునరేషన్ కాదు. అలాని సినిమా అయిపోయాక కూడా వీళ్లకి ఇంతకుమించి ఇవ్వరు..

ఇదే పూర్తి రెమ్యునరేషన్ కాదంటే, ఇంకా ఇవ్వాలి. ఇంకా ఇచ్చేదేం లేదంటే, ఇదే ఫైనల్ రెమ్యునరేషన్ అనుకోవాలి.. అదికాదు, ఇది కాదంటే ఎలా అనే డౌట్ రావొచ్చు. నిజానికి సినిమా అయిపోయే వరకు, అయిపోయాక కూడా మహేశ్, రాజమౌళి, ప్రియాంకకి ఇప్పుడిచ్చిన రెమ్యునరేషనే ఫైనల్. కాకపోతే యూఎస్ రైట్స్, నార్త్ ఇండియారైట్స్, లేదంటే ప్రాఫిట్స్ లో 25 , 25,50 శాతం చొప్పున రాజమౌళి, మహేశ్ , నిర్మాత పంచుకోబోతున్నారు. అందులో ప్రియాంకకి 5శాతం ఇచ్చేందుకు ఒప్పుకున్నారట

అంటే 1000 కోట్ల మహేశ్ మూవీ కనీసం 4 వేల కోట్లు రాబడుతుందనే అంచనాలున్నాయి. సీన్ రివర్స్ అయితే చెప్పలేం కాని, పాన్ వరల్డ్ మూవీ కాబట్టి, 1000 కోట్ల బడ్జెట్ కి కనీసం 4 రెట్లు వసూళ్ళు వస్తేనే అది సెన్సేషన్ అనే పరిస్థితి ఉంటుంది. ఆలెక్కన నిర్మాతకి 2 వేల కోట్లు, హీరోకి 1000 కోట్లు, డైరెక్టర్ కి 1000 కోట్లు దక్కేఛాన్స్ ఉంది. ఇందులోనే 5శాతం అంటే, 200 కోట్లు ప్రియాంకకి దక్కే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు 20 కోట్లని టోకెన్ ఎమౌంట్ గా భావించి సైన్ చేసిందని తెలుస్తోంది.