రాజమౌళి, మహేశ్ బాబు AI సాహసాలు… వార్ 2 లో ముందే రికార్డులు..
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాన్ వరల్ట్ మూవీ ని 1000 కోట్ల తో ప్లాన్ చేశాడు రాజమౌలి. అదెప్పుడు పట్టాలెక్కుతుందో కాని, దానికంటే ముందే ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ 2 ఒక విషయంలో రికార్డు క్రియేట్ చేస్తోంది. ఆరికార్డు విషయంలో రాజమౌళి, మహేశ్ బాబు మూవీతో వార్ 2 సినిమా పోటీ పడుతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాన్ వరల్ట్ మూవీ ని 1000 కోట్ల తో ప్లాన్ చేశాడు రాజమౌలి. అదెప్పుడు పట్టాలెక్కుతుందో కాని, దానికంటే ముందే ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ 2 ఒక విషయంలో రికార్డు క్రియేట్ చేస్తోంది. ఆరికార్డు విషయంలో రాజమౌళి, మహేశ్ బాబు మూవీతో వార్ 2 సినిమా పోటీ పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ ని ప్రతీ ఫీల్డ్ లో వాడుతున్నారు. సినిమాల్లో కొద్ది కొద్దిగా వాడుతుంటే, హాలీవుడ్ లో భారీ ఎత్తున ఏఐ టూల్స్ తోపెద్ద సినిమాల ప్లానింగ్ నడుస్తోంది. ఇలాంటి టైంలో అదే టెక్నాలజీతో 50శాతం సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు రాజమౌలి. కట్ చేస్తే అలాంటి సాహసమే, రాజమౌళి కంటేముందే బాలీవుడ్ బ్యాచ్ చేస్తోంది… ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వార్ 2 లో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ మ్యాజిక్ ఎప్పుడో మొదలైంది… ఇంతకి ఏంటీ ఈ ఏఐ తమాషా..? దాంతో తారక్ అండ్ కో కి కలిసొచ్చేదేంటి?
2015 అంటే ఆల్ మోస్ట్ దాదాపు పదేళ్ల క్రితమే నార్త్ సౌత్ అన్న అడ్డుగోడలను బాహుబలితో కూల్చాడు రాజమౌళి. తర్వాత రెండేళ్లకు బాహుబలి 2 తో హిందీ హీరోలు ఇన్ సెక్యూరిటీలో పడేలా, సౌత్ నుంచి బాలీవుడ్ కి రాచ బాట వేశాడు రాజమౌళి. ఇప్పుడు అలాంటి పనే చేయబోతున్నాడు. ఈసారి వరల్డ్ మార్కెట్ కి ఇండియన్ సినిమాకు మధ్య ఉన్న గోడలని కూల్చేందుకు పాన్ వరల్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు
ఏడాదిగా ఇదెప్పుడు పట్టాలెక్కుతుంది? ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందనే డిస్కర్షన్ జరుగుతోంది. కాని మహేశ్ బాబు లేకుండానే 50శాతం సినిమాను ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ సాయంతో రాజమౌళి షూట్ చేశాడని తేలింది.. ఆ ఫుటేజ్ ని రెఫరెన్స్ గానే అసలు షూటింగ్ జనవరి నుంచి లాంచనంగా మొదలు కాబోతోంది. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది
అయితే 250 కోట్లు ఖర్చుతో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ టూల్స్ ని, హాలీవుడ్ బ్యానర్ డ్రీమ్ వర్క్స్ సాయం తో వాడబోతోంది రాజమౌళి టీం. సెట్లు, యాక్షన్ సీక్వెన్స్ ని గ్రీన్ మ్యాట్ లో భారీ ఎత్తున ప్లాన్ చేశారట…అయితే ఇలాంటి టెక్నాలజీని, లేదంటే ట్రెండ్ సెట్టింగ్ ప్రయోగాలని ఎక్కువగా రాజమౌళినే మొదలు పెడతాడు. కాని ఈసారి ఫస్ట్ టైం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ వార్ 2 తో బాలీవుడ్ ఒక అడుగు ముందుకేసింది..
వార్ 2 షూటింగ్ మొదలయ్యే లోపే హీరోలు లేకుండా చాలా వరకు యాక్షన్ సీన్లు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో షూట్ చేశారు. వాటినే మళ్లీ రియల్ సెట్స్ లో షూట్ చేస్తున్నారు. దీనికి దాదాపు 120 కోట్ల వరకు ఖర్చయ్యిందట. జనవరి 10 లోపు వార్ 2 షూటింగ్ పూర్తవుతుందట. ఇదే జరిగితే ఇండియాలో ఏఐ టూల్స్ వాడి సగానికి పైనే సినిమా షూట్ చేసిన మొదటి మూవీగా ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ సినిమా వార్ 2 చరిత్ర స్రుష్టించే ఛాన్స్ఉంది…
ప్రస్థుతానికైతే సూపర్ స్టార్ మహేవ్ బాబు జెర్మనీలో ఏఐ టూల్స్ కి అనుగునంగా తను టెక్నాలీజీతో పాటు అప్ డేట్ అయ్యేందుకు, సెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ టూల్స్ కి అనుగునంగా నటంచేందుకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. వర్క్ షాప్స్ తో చాలా వరకు బిజీ అయ్యాడు..