సూపర్ స్టార్ నోరునొక్కి… తన నోరు మూసుకున్న జక్కన్న…
రాజమౌళి తన నోరు కట్టేసుకున్నాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే తన నోరుని తానే కుట్టేసుకున్నాడు. తెలుగు మీడియా, హిందీ మీడియా ఎంత అడిగినా సూపర్ స్టార్ మహేశ్ సినిమా తాలూకు అప్ డేట్స్ కాదు కదా, కనీసం ఆ సినిమా గురించి మాటే ఎత్తట్లేదు...
రాజమౌళి తన నోరు కట్టేసుకున్నాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే తన నోరుని తానే కుట్టేసుకున్నాడు. తెలుగు మీడియా, హిందీ మీడియా ఎంత అడిగినా సూపర్ స్టార్ మహేశ్ సినిమా తాలూకు అప్ డేట్స్ కాదు కదా, కనీసం ఆ సినిమా గురించి మాటే ఎత్తట్లేదు… విచిత్రం ఏంటంటే తెలుగు సినిమా ఎదుగుదల చూసి కుళ్లుకునే తమిళ మీడియా కూడా, ఈమధ్య రెండు మూడు సార్లు రాజమౌళిని అప్ డేట్ అడిగారంటే, తన సినిమాకోసం కోలీవుడ్ లో కూడా క్యూరియాసిటీ ఎంతుందో తెలిసిపోతోంది. అయినా లాంచ్ లేదు, ఆఖరికి రామోజీ ఫిల్మ్ సిటీలో డమ్మీ షూటింగ్ చేసినా అది కూడా బయటికి పొక్కలేదు… సూపర్ స్టార్ మహేశ్ బాబు నోరు కూడా ఆల్ మోస్ట్ నొక్కేశాడు రాజమౌళి.. మరి ఇంత సీక్రసి, ఇంత సైలెన్స్ వెనక అంత పెద్ద రీజనుందా? లేదంటే పెరిగిన మార్కెట్, క్రేజ్ వల్ల తప్పట్లేదా?
దేవర మూవీని ఫ్యామిలీతో సహా వచ్చి చూసిన రాజమౌళి, మీడియాను అవాడ్ చేయటమే కాదు, సూపర్ స్టార్ మహేశ్ బాబు తో సినిమా తాలూకు ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఇదే కాదు తన అన్న కొడుకు మూవీ మత్తువదలరా సీక్వెల్ ప్రమోషన్ లోకూడా తను జాయిన్ అయ్యాడు. ఆ ఈవెంట్ లో కాని, మరో ప్రెస్ మీట్ లో కాని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీసే సినిమా తాలూకు చిన్న క్లూ కాదుకదా, కనీసం ఆ డైరెక్షన్ లో వచ్చే ప్రశ్నలకు కూడా నో చెప్పాడు
రీసెంట్ గా ముంబైలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నార్త్ మీడియా నెక్ట్స్ మూవీ మీద ప్రశ్నలు వేస్తుంటే, సౌత్ ఆఫ్రికా నుంచి రిటర్న్ అయిన రాజమౌళి నోరువిప్పలేదు. అసలు ఈ సినిమా టైటిల్ మహారాజానా, గోల్డా.? లేదంటే మరోటా అన్నది ఇంతవరకు తేలలేదు..
కాని రామోజీ ఫిల్మ్ సిటీలో మాత్రం డమ్మీ హీరోని పెట్టి రెండు సీన్ల డమ్మీ షూట్ చేశారు. కనీసం తను చేసే సినిమాకు వర్కింగ్ టైటిల్ గాప్రొడక్షన్ నంబర్ ఏదో ఒకటి పెట్టడం కామన్. అది కూడా పెట్టలేదు. డమ్మీ ఆర్టిస్టులని కూడా బయటి తిరక్కుండా, సినిమా న్యూస్ లీక్ కాకుండా చూస్తున్నాడు.
ఆల్రెడీ సూపర్ స్టార్ మహేశ్ బాబుని హైజ్ కే పరిమితం చేశాడు. తన లుక్ రివీల్ కావొద్దనే అలా చేసినా, అద్రుష్టం కొద్ది తను సీఎం ని కలవటమో, మరో కారనంతో బయటికి రావటం వల్ల తన లుక్ రివీల్ అవుతోంది. ఇలా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కొంతలో కొంత సంతోషం దక్కుతోంది. కాని మహేశ్ బాబు కూడా నోరు విప్పింది లేదు.
న్యూస్ బయటికి లీకైంది లేదు. అసలు సినిమా లాంచ్ కాకుండా డమ్మీ షూట్ చేయటమే వింత అనుకుంటే, సింగిల్ అప్ డేట్ ఇవ్వకుండా, కనీసం లాంచ్ ఎప్పుడో తేల్చకుండా, అన్నీ ఈవెంట్లకి, మిగతా మూవీల ప్రమోషన్స్ కి వెళ్లటం చాలా విచిత్రం…. దేశ వ్యాప్తంగా మీడియా ఎంత ప్రెజర్ పెంచినా రాజమౌళి నోరు విప్పకపోవటానికి కారనం, తనేనా, అంటే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ పెట్టిన కండీషన్స్ అని తెలుస్తోంది
జురాసిక్ పార్క్ తీసిన స్టీవెన్ స్పిల్ బర్గ్ ఓన్ ప్రొడక్షన్ హౌజ్ అయిన
డ్రీమ్ వర్క్స్ తో రాజమౌలి టీం కలిసి ఈ సినిమా తీయబోతోంది కాబట్టి, అక్కడి రూల్స్ ని పాటించక తప్పట్లేదట. ఆ కండీషన్స్ చూస్తే కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చాకే సినిమాని ఎనౌన్స్ చేయాల్సి ఉంటుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోసహా ముందే అన్నీ పనులు పూర్తవ్వాలి. రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ చేయాలి. అందులో వాయిదాలు ఉండొద్దు. షూటింగ్ టైం లోకాని, షూటింగ్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ లో కాని ఎలాంటి మార్పులుండొద్దు.. బౌండెడ్ స్క్రిప్ట్ లో ఎలా ఉందో అలానే చివరి వరకు మేయింటేన్ చేయాలి… ఇలాంటి కండీషన్స్ వల్ల, ముందే సినిమాలు లాంచ్ చేసినా, రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినా, ఇంకే విషయం బయటికి చెప్పినా, అది అఫీషియల్ అయిపోతుంది.. ఆ రూల్ ని పాటించకపోతే, హాలీవుడ్ బ్యానర్ లీగల్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితులుంటాయి. సో ఇలాంటి కారణాలతోనే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడట రాజమౌలి. అలాంటప్పుడు ఎందుకు హాలీవుడ్ బ్యానర్ తో టై అప్ అవ్వాలంటే, దానికో లాజిక్ ఉంది. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ సపోర్ట్ వల్లే, త్రిబుల్ ఆర్ మూవీకి ఆస్కార్ అందుకునేంతగా ప్రమోషన్ దక్కింది. కాబట్టి పాన్ వరల్డ్ మూవీ తీయాలంటే, ఆరేంజ్ బడ్జెట్ కి సపోర్ట్ దొరకాలంటే హాలీవు్డ సంస్థతో టై అప్ కాకతప్పదు..