Rajamouli New Home In USA:అమెరికాలో ఇల్లు తీసుకున్న జక్కన్న.. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేస్తారా..

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ క్రియేట్‌ చేయటం అయిపోయింది.. పాన్‌ ఇండియాలో పవర్‌ చూపించడం కూడా పూర్తయింది.. అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్‌ తీసుకోవడం కూడా కంప్లీట్‌ అయిపోయింది. ఇప్పుడు జక్కన్న నెక్ట్స్‌ప్లాన్‌ ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహాభారతమేనా ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2023 | 06:21 PMLast Updated on: Mar 15, 2023 | 6:21 PM

Rajamouli New Home In Usa

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ క్రియేట్‌ చేయటం అయిపోయింది.. పాన్‌ ఇండియాలో పవర్‌ చూపించడం కూడా పూర్తయింది.. అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్‌ తీసుకోవడం కూడా కంప్లీట్‌ అయిపోయింది. ఇప్పుడు జక్కన్న నెక్ట్స్‌ప్లాన్‌ ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహాభారతమేనా ? ఈ ప్రశ్నకు దాదాపు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ట్రిపులార్‌ సినిమా తరువాత రామ్‌ చరణ్‌,తారక్‌ కంటే రాజమౌళికి వరల్డ్‌ వైడ్‌గా ఎక్కువ పేరు వచ్చింది. ఇక ఆస్కార్‌ కూడా రావడంతో రాజమౌళి హాలీవుడ్‌ పీస్‌ అని దాదాపు అంతా ఫిక్స్‌ అయ్యారు. అయితే కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న గాసిప్స్‌ ప్రకారం జక్కన త్వరలోనే హాలీవుడ్‌లో సినిమా చేయబోతున్నారట. ఈ గాసిప్‌ రావడానికి కారణం.. రాజమౌళి అమెరికాలో ఇల్లు తీసుకోవడం. నిజమే.. లాస్ ఏంజిల్స్‌లో జక్కన్న ఓ ఇల్లు తీసుకున్నారట. దీంతో త్వరలోనే ఆయన అమెరికాకు షిఫ్ట్‌ కాబోతున్నారంటూ టాలీవుడ్‌ వర్గాల్లో గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే టాలీవుడ్‌లో ఆయన తీసే లాస్ట్‌ సినిమా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్ చేసిన తరువాత.. మొత్తం హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్‌ మహాభారతాన్ని స్టార్ట్‌ చేస్తారంటూ అంతా చెప్పుకుంటున్నారు. మహాభారతం సినిమా తీయడం తన జీవితాశమని జక్కన్న ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. కానీ తన విజన్‌లో ఉన్న విజువల్స్‌ను స్క్రీన్‌ మీద చూపించడం నేర్చుకున్న తరువాతే ఆ సినిమా తీస్తానన్నారు. ప్రతీ సినిమాలో కొత్త విజువల్‌ వండర్స్‌ చూపిస్తే మహాభారతం కోసం తనను తాను తయారు చేసుకుంటున్నానంటూ చెప్పాడు. ఇప్పుడు హాలీవుడ్‌ సినిమా ద్వారా మహాభారతానికి కావాల్సిన టెక్నికల్‌ నాలెడ్జ్‌ను జక్కన్న సంపాదించే ప్లాన్‌లో ఉన్నారంటూ టాక్‌ నడుస్తోంది. ఇదే నిజమైతే ఇక టాలీవుడ్‌కు జక్కన్న దూరమైనట్టే అంటున్నారు ఆయన ఫ్యాన్స్‌.