సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి మొదలు పెట్టిన మూవీ, కనీసం 3 ఏళ్లు సెట్స్ పైనే ఉండే ఛాన్స్ ఉంది. అంతా కలిసొస్తే ఏడాదిన్నరలో మహేశ్ బాబు సినిమా రిలీజ్ అవుతుందని రామ్ చరణ్ అన్నాడు. రియాలిటీ చూస్తే రెండు భాగాల సినిమా అంటే, ఈజీగా మూడు నుంచి నాలుగేళ్లు పట్టేలా ఉంది. ఒక్కో భాగం రెండు ఏళ్లు తీసినా, నాలుగేల్లు మహేశ్ బాబు ఈ సినిమాకే అంకితమవ్వాల్సి వస్తుంది. కాలం కలిసొస్తే మూడేళ్లలో రాజమౌళి ఈ రెండు భాగాలు పూర్తి చేసే ఛాన్స్ఉంది. అదే జరిగితే, ఆతర్వాత రాజమౌలి ఎవరితో సినిమా తీస్తాడు..? త్రిబుల్ ఆర్2 నిజంగానే మొదలౌతుందా అంటే, ఎవరికీ అయితే ఆ నమ్మకం లేదు. కాని రాజమౌలి కూడా పూర్తిగా మహేశ్ బాబు సినిమా మీదే ఫోకస్ చేయటంతో, నెక్ట్స్ ఎవరితో అని అంచనా వేసే పరిస్తితి లేదు. కాకపోతే ఎన్టీఆర్, చరన్, ప్రభాస్ ఈ ముగ్గురిలో ఎవరితోనైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉందని ఊహించుకోవటమే తప్ప మరో ఛాన్స్ లేదు.. ఐతే అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఎప్పటి నుంచో రాజమౌలిని కన్విన్స్ చేసేందుకు అల్లు అరవింద్ ప్రయత్నాలుచేస్తూనే ఉన్నాడు. మగధీర తర్వాత కూడా చాలా సార్లు రాజమౌలిని తన కొడుకుతో సినిమా తీయమన్నట్టు ప్రచారం కూడా జరిగింది. కాని ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. ఇప్పుడు సెట్ అవుతుందా? ఎన్టీఆర్ తో రాజమౌలి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసే అవకాశాలున్న వేళ, సడన్ గా సీన్ లోకి బన్నీని ముందుకు తెస్తున్నారా? అల్లు అరవింద్ ప్రయత్నాలు ఫలించే ఛాన్స్ఎంత? అసలెందుకు బన్నీతో ఇప్పవరకు రాజమౌలి సినిమా తీయలేదు? సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి సినిమా తీస్తున్నాడు. ఆల్రెడీ లాంచ్ చేశాడు. రెండు భాగాలతో ప్లాన్ చేశారంటే, కనీసం మూడేళ్లు, లేదంటే నాలుగేళ్ల ఈ సినిమాకే మహేశ్, రాజమౌలి ఇద్దరు అంకితం అవ్వాల్సి ఉంటుంది.. మరి ఆ తర్వాత ఎవరితో రాజమౌలి సినిమా తీస్తాడనే ప్రశ్న ఎదురౌతోంది ఇప్పటి వరకు రాజమౌలి జర్నీ చూస్తే ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్ తీశాడు. ఇక ప్రభాస్ తో చత్రపతి, బాహుబలి1, బాహుబలి 2 తీశాడు. రామ్ చరణ్ తో మగధీర, త్రిబుల్ ఆర్ తీశాడు. ఇలా చూస్తే రాజమౌలి కెరీర్ లో ఎక్కువ శాతం వర్క్ చేసిన హీరోలనే రిపీట్ చేశాడు. కాబట్టి మహేశ్ బాబు తో తీస్తున్నమూవీ తర్వాత మళ్లీ ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ ముగ్గురిలో ఎవరితోనైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేసే ఛాన్స్ఉంది ఐతే మహేశ్ బాబుతర్వాత తమిళ్ హీరోలతోనో, హిందీ స్టార్లతోనే రాజమౌళి సినిమా ప్లాన్ చేయొచ్చుగా అనే డౌట్ రావటం కూడా కామనే. కాని తెలుగు హీరోలతోనే తనకి కంఫర్ట్ అని రాజమౌళి పరోక్షంగా ఎప్పుడో తేల్చాడు. అవసరమైతే ఇతర భాషలకు సంబంధించిన హీరోలని, తన సినిమా ల్లోకి తీసుకుంటాడేమో, కాని తన కోసం నెలలు, సంవత్సరాలు డేట్లిచ్చే తెలుగు స్టార్లను కాదని మరో హీరోవైపు చూడడు అలా చూస్తే మహేశ్ తర్వాత మళ్లీ తెలుగు హీరోలు, అందులో తనతో రిపీటెడ్ గా పనిచేసిన స్టార్లతోనే మూవీలు తీస్తాడా అంటే, మరి మహేశ్ సంగతేంటి..? తనతో ఒక్క మూవీ తీయలేదు. కాని తనతో ఇప్పుుడ సినిమాకు కమిటయ్యాడు కదా...అలానే ఇంతవరకు బన్నీ తో సినిమాచేయని రాజమౌళి, తనతో కూడా మూవీ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఆల్రెడీ అల్లు అరవింద్ అప్పుడెప్పుడో మగధీర హిట్ తర్వాత నుంచే తనకొడుకుతో సినిమా తీయమని రాజమౌలి వెంటపడుతున్నాడు. కాని ఇంతవరకు అది కుదర్లేదు. సో పుష్పతో దేశవ్యాప్తంగా ఫోకస్ అయిన బన్నీతో, ఇప్పుడైనా రాజమౌలి తీస్తాడా అంటే ఇప్పుడప్పుడే చెప్పలేమనే సమాధానమే వస్తుంది. కాని రాజమౌలి మాత్రం త్రిబుల్ ఆర్ టైంలోనే ఎన్టీఆర్ తో ఓ స్టోరీ ఐడియా పంచుకున్నాడు. అదే మహేశ్ బాబు సినిమా తర్వాత పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కాని సీన్లోకి బన్నీని తీసుకొచ్చేందుకు అల్లు అరవింత శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎప్పుడో మూడేళ్ల తర్వాత రాజమౌళి ప్లాన్ చేసే మరో మూవీకి ఇప్పటి నుంచే వెంటపడతారా అంటే, అలా అయితేనే రాజమౌళి తో పనౌతుంది.. అది తెలిసే అల్లు అరవింద్, బన్నీకోసం జక్కన్న వెంటపడుతున్నాడట. బన్నీ కూడా ఒక మెట్టుతగ్గి, రాజమౌలిని కలిసే పనిలో ఉన్నాడట... ఏదైనా సంక్రాంతి తర్వాత ఈ మీటింగ్ కి ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది [embed]https://www.youtube.com/watch?v=2NRrGOGe3-I[/embed]