2000 కోట్ల కోసం 4 వేలకోట్ల కష్టాలు.. సెట్లో పాన్ వరల్డ్ రీసౌండ్..

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన పాన్ వరల్డ్ మూవీ, సంక్రాంతికే లాంచ్ అన్నారు. కాని పండగ తర్వాతే అసలు పండగ పాన్ వరల్డ్ లెవల్లో మొదలౌతుందని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2024 | 03:59 PMLast Updated on: Dec 20, 2024 | 3:59 PM

Rajamouli Plans A Pan World Movie With Superstar Mahesh Babu

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన పాన్ వరల్డ్ మూవీ, సంక్రాంతికే లాంచ్ అన్నారు. కాని పండగ తర్వాతే అసలు పండగ పాన్ వరల్డ్ లెవల్లో మొదలౌతుందని తెలుస్తోంది. జర్మనీలో మహేశ్ బాబు వర్క్ షాప్ పూర్తైంది. 100 ఎకరాల్లో ప్లాస్టిక్ అడవిని క్రియేట్ చేసేందుకు రాజమౌళికి లొకేషన్ దొరికింది. జనవరి 28 నే ఈ సినిమాను లాంచ్ చేసేందుకు ముహుర్తం కుదిరింది. మొత్తంగా ఈసారి సినిమా లాంచ్ కు హాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్లు, మరో ఇద్దరు డైరెక్టర్ లు వస్తుంటే, కొరియా, ఇండోనేషియానుంచి ఇంకొందరు ల్యాండ్ కాబోతున్నారు. రాజమౌళి సినిమా అంటే పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల నటులు కనిపిస్తారు. ఆ ట్రెండ్ స్టార్ట్ చేసిందే తను… అలాంటిది ఇక పాన్ వరల్డ్ మూవీ అంటే ప్రపంచ నలుమూలల నుంచి నటులు రావాల్సిందే… ఇంతకి జనవరి 28న బ్రహ్మాండం బద్దలయ్యేంతగా, రాజమౌళి సినిమాను లాంచ్ చేస్తున్నాడా? ఇంకా ఎలాంటి సర్ ప్రైజులు ఉండబోతున్నాయి..?

మహేశ్ బాబు తోరాజమౌలి సినిమా ఎప్పుడో దసరాకే లాంచ్ అవ్వాలి.. కాని కాలేదు. డిసెంబర్ ఎండ్ కి అన్నారు.. అప్పుడు జరగలేదు… తర్వాత సంక్రాంతికి కాస్త ముందు ఈ సినిమాలాంచ్ కాబోతోందన్నారు. అది జరిగేలా లేదు. కనీసం రిపబ్లిక్ డే రోజు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న ప్రచారం వాస్తవం కాదని తేలింది. జనవరి 28నే ఈ పాన్ వరల్డ్ మూవీ భారీ ఎత్తున లాంచ్ కాబోతోంది

రాజమౌళి కెరీర్ ని టర్న్ చేసిన ఏ మూవీ లాంచ్ కూడా అంత సాధా సీదాగా జరగలేదు. రెగ్యులర్ మూవీల నుంచి రూట్ మార్చి ఈగ షురూ చేసినప్పుడు ఈ ప్రాజెక్టుని భారీగానే మొదులపెట్టాడు. బాహుబలి తో పాన్ ఇండియా గేట్లు బద్దలు కొట్టిన తను ఆ సినిమా టైంలో కూడా భారీ ఎత్తునే సినిమా లాంచ్ చేశాడు. కట్ చేస్తే, త్రిబుల్ ఆర్ లాంచ్ కూడా అలానే జరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ తర్వాత పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసేందుకు టైం వచ్చినట్టుంది

అందుకే ఈ సారి సినిమా లేటైనా సెన్సేషన్ అయ్యేలా గట్టి ప్లానింగ్ నే చేస్తున్నాడు రాజమౌళి. ఆల్రెడీ హీరోయిన్ గా ఇండోనేషియా మూలాలున్న చెల్సితో పాటు, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక చోప్రాని కన్ఫామ్ చేశాడు. ఇక నెగెటీవ్ రోల్ లో ఏకంగా హాలీవుడ్ హ్యాండ్సమ్ క్రిస్ హోమ్ వర్త్ ని కన్ఫామ్ చేశారని తెలుస్తోంది. అవెంజర్ ఫేం, థ్రోన్ హీరో అయిన తను మహేశ్ బాబుకి ఎగైనెస్ట్ గా చేస్తే ఇక ఇది హాలీవుడ్ మూవీతోనే సమానం.

అంతేకాదు మరో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ కూడా స్పెషల్ రోల్ వేసే అవకాశాలున్నాయట. బేసిగ్గానే ఇండియా అంతే ప్రత్యేక అభిమానం చూపించే ఈ హాలీవుడ్ స్టార్ రాజమౌళి పిలుపుతో వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇది కాకుండా హాలీవుడ్ డైరెక్టర్లైన స్టీవెన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామేరున్ కూడా ఇండియాకి పయనమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్లు ప్రొడక్షన్ లో భాగం పంచుకుంటున్నారో లేదంటే, రాజమౌళి ఇన్విటేషన్ తో వస్తున్నారో క్లారిటీ లేదు. కాని వాళ్ల రాక ఆల్ మోస్ట్ కన్ఫామ్ అని తెలుస్తోంది.

మొత్తంగా జనవరి 28న ఇండియా టాప్ యాక్టర్స్, హాలీవుడ్ నటులు, దర్శకులతో పాటు ఇండోనేషియా నటి, ఇలా ప్రపంచ నలుమూలలనుంచి పాన్ వరల్ట్ స్టార్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో ల్యాండ్ అవటం కన్ఫామ్ అవుతోంది. ఆరోజే కాస్ట్ అండ్ క్రూ, టైటిల్ , బేసిక్ కాన్సెప్ట్ ని ప్రెస్ మీట్లో రివీల్ చేసేందుకు భారీ ఎత్తున ప్లానింగ్ జరుగుతోంది. ఇలా అన్నీ కుదరటం కోసమే, రాజమౌళి ఇంతకాలం ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించేందుకు టైం తీసుకున్నాడు

అంతెందుకు లోకనాయకుడు కమల్ హాసన్ లాంటి స్టారే తన మరుగనాయకన్ లాంచ్ ఈవెంట్ కి బ్రిటిష్ రాణిని గెస్ట్ గా తీసుకొచ్చాడు. ఆ సినిమా ఆగిపోయినా, అప్పట్లో ఆ మూవీ మొదలవ్వటమే పెద్ద సెన్సేషన్ అయ్యింది. అంతకుమించి రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.