మహేష్ సినిమా@ 3 వేల కోట్లు, రాజమౌళి టార్గెట్… డబ్బులేనా జక్కన్న…?

మన సినిమాతో భూకంపం రావాలి అనుకుంటాడో ఏమో గాని రాజమౌళి ప్లానింగ్ మొత్తం కూడా భారీగా ఉంటుంది. ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్ గా జక్కన్న దుమ్ము రేపుతున్నాడు. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు జక్కన్నతో సినిమా ఓ డ్రీం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 5, 2024 | 07:24 PMLast Updated on: Oct 05, 2024 | 7:24 PM

Rajamouli Set Big Target For Movie With Mahesh Babu

మన సినిమాతో భూకంపం రావాలి అనుకుంటాడో ఏమో గాని రాజమౌళి ప్లానింగ్ మొత్తం కూడా భారీగా ఉంటుంది. ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్ గా జక్కన్న దుమ్ము రేపుతున్నాడు. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు జక్కన్నతో సినిమా ఓ డ్రీం. మన సౌత్ లో కూడా ఇతర భాషల్లో జక్కన్నతో ఒక్క సినిమా ప్లీజ్ అంటూ ఎదురు చూస్తున్నారు. పక్కా లెక్కలతో సినిమాలు చేసే జక్కన్న… వసూళ్ళ విషయంలో భారీ టార్గెట్ లు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కో సినిమాకు ఒక్కో టార్గెట్ పెడుతూ ఇప్పుడు మహేష్ సినిమాతో ఏకంగా హాలీవుడ్ కి గురిపెట్టాడు.

మహేష్ బాబు సినిమాను రెండేళ్ళలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తా అని చెప్తున్న జక్కన్న… ఆ సినిమా షూటింగ్ మొత్తం ఇప్పుడు విదేశాల్లోనే ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. ఇందుకోసం మహేష్ బాబును కాస్త భిన్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు జుట్టు పెంచి కొత్తగా కనపడుతున్నాడు. ఇక వసూళ్ళ మీద అప్పుడే ఓ లెక్క వేసుకోవడం మొదలుపెట్టాడు జక్కన్న. ఈ సినిమాకు టార్గెట్ 3 వేల కోట్లు అని టాక్. కల్కీ సినిమా 1200 కోట్లు ఇప్పటి వరకు హైయెస్ట్. ఇప్పుడు జక్కన్న రెండేళ్ళ తర్వాత 3 వేల కోట్లు అని పెట్టుకున్నాడు.

ఈ లోపు ప్రభాస్ 2 వేల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. అందుకే నా టార్గెట్ 2 కాదు 3 అని పెట్టుకున్నాడు. అదే జరిగితే బాలీవుడ్ కూడా షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని భాషల్లో మహేష్ తోనే డబ్బింగ్ చెప్పించడంతో పాటుగా ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ లను ఈ సినిమాకు వాడుతున్నాడు. హీరోయిన్ లు కూడా ఇద్దరు ఉండే అవకాశం ఉందని టాక్. ఇక సినిమాను హాలీవుడ్ లో ప్రమోట్ చేయడానికి ఇప్పటికే జక్కన్న ఓ ప్లాన్ పెట్టుకున్నాడట. ఇక ఇండియాలో పెద్దగా ఆయన ప్రమోషన్ చేసినా చేయకపోయినా సమస్య ఉండదు. అందుకే ప్రమోషన్ గురి హాలీవుడ్ అంటున్నాడు ఈ దర్శక ధీరుడు. మహేష్ లుక్స్ కూడా హాలీవుడ్ హీరోలకు తగ్గట్టే ఉండటం గమనార్హం.