రాజమౌళి సైలెంట్ గా సూపర్ స్టార్ మూవీని లాంచ్ చేశాడు. పూజా కార్యక్రమాలు కూడా ప్రైవేట్ గానే జరిగాయి. ఎప్పుడూ తన సినిమా లాంచ్ చేసినా ప్రెస్ మీట్ పెట్టి, డిటేల్స్ ఇచ్చే రాజమౌళి సడన్ గా ఇలా ఎందుకు చేశాడు? ఎందుకు గేమ్ చేంజర్ ఈవెంట్ లో మహేశ్ మూవీ గురించి నోరు మెదపలేదు...? లాంటి డౌట్లే పెరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు తనెందుకు అలా చేశాడో క్లారిటీ వచ్చేసింది. మహేశ్ బాబు మూవీని సైలెంట్ గా లాంచ్ చేయటానికి రెండు కారణాలున్నాయని తెలుస్తోంది. ఒకటి ఇంటర్ నేషనల్ మీడియా... రెండో కారణం హాలీవుడ్ లేడీ.. ఈ రెండు కారణాలతోనే రాజమౌళి సైలెంట్ గా సినిమాను లాంచ్ చేశాడట. ఇంతకి ఇంటర్నేషనల్ మీడియా, హాలీవుడ్ లేడీ వల్లనే ఎందుకు లోకల్ మీడియాని రాజమౌళి దూరం పెట్టాడు...? అక్కడే అసలు ట్విస్ట్ షాక్ ఇస్తోంది.... అదేంటో చూసేయండి. రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మూవీ అంటే బ్రహ్మండం బద్దలయ్యే రేంజ్ లో హడావిడితో లాంచ్ అవుతుందనుకుంటే, అసలు సినిమా ఎప్పుడు లాంచైందో ఎవరికీ తెలియనంత సీక్రెట్ గా ఆ తంతు జరిగిపోయింది. అదే రోజు గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ కి వచ్చిన రాజమౌలి, అసలు మహేశ్ మూవీ తాలూకు చిన్న క్లూ కూడా చెప్పకుండా ట్రైలర్ లాంచ్ చేసి జారుకున్నాడు ఇంత సీక్రెట్ గా ఎందుకు మహేశ్ బాబు సినిమాను లాంచ్ చేశారు? ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టి డిటేల్స్ ఇచ్చే రాజమౌళి ఇంత సీక్రసి ఎందుకు మేయింటేన్ చేస్తున్నాడు? లాంటి డౌట్లు రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెరిగిపోయాయి. వీటికి ఇప్పుడు ఆల్ మోస్ట్ ఆన్సర్ దొరికింది. ఓ భారీ ప్రెస్ మీట్ కి ఈనెల్లోనే ప్లాన్చేశాడు రాజమౌలి. ఆ ప్రెస్ మీట్ లో యూఎస్ తాలూకు మేజర్ ఛానల్స్, అలానే యూరోపియన్ ఛానెల్స్ తోపాటు చైనా, జపాన్, కొరియా, రష్య,బ్రేజిల్ మీడియా కూడా హాజరయ్యేలా చేస్తున్నాడట. ఈ విషయంలో ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రాజమౌళి టీం కి హెల్ప్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఆస్కార్ రేసులో త్రిబుల్ ఆర్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పరంగా, నెట్ ఫ్లిక్స్ సంస్థే రాజమౌళి టీం కి హెల్ప్ చేసిందన్నారు. అచ్చంగా అలానే ఇప్పుడు రాజమౌలి కోసం నెట్ ఫ్లిక్స్ సంస్త రంగంలోకి దిగింది. అది అంతగా హెల్ప్ చేసిన ఇంటర్ నేషనల్ మీడియాని ఇక్కడికి పిలిపించటం అంత అవసరమా అంటే, ఖచ్చితంగా అవసరమే. 1500 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ను రెండు భాగాలుగా పాన్ వరల్డ్ మార్కెట్ లో కి వదలబోతున్నారు ఇండియానా జోన్స్ ప్రేరణే అయినా, అంతకుమించేలా సినిమా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. తన మూవీలో ఎంతగా కంటెంట్ బాగున్నా, అది సాధ్యమైనంత ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే పబ్లిసిటీనే ప్రధాన ఆయుదం. అందుకే అక్కడే తగ్గేదిలేదంటున్నాడు రాజమౌలి. అందుకే మొన్న సీక్రెట్ గా సినిమాను లాంచ్ చేసి, సినిమా తాలూకు ఏడిటేల్స్ లోకల్ మీడియాలో రాకుండా జాగ్రత్త పడ్డడట. అన్నీ డిటేల్స్ ముందే లోకల్ మీడియాలో వస్తే, ఇంటర్నేషనల్ మీడియా ముందు చెప్పడానికేముండదు. పబ్లిసిటీ స్ట్రాటజీ డైల్యూట్ అవుతుంది. అందుకే ఈనెల 26 వరకు ఇదే సీక్రసీ మేయింటేన్ చేస్తాడట. ఈలోపు హీరోయిన్ సమస్య కూడా తీరిపోవచ్చు. మాజి మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ వదిలిన హాలీవుడ్ లోసెటలైంది. తనకి అక్కడి మార్కెట్ ని ప్రభావితం చేసేంత ఇమేజ్ ఉంది. అందుకే తన ని హీరోయిన్ గా ట్రై చేశారట. తనకి కథ నచ్చినా, ఇంకా తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, జనవరి 26న ఇంటర్నేషనల్ మీడియ ముందు భారీ ప్రెస్ మీట్ పెట్టడం, అలా ఈసినిమా ప్రమోషన్ ని షూటింగ్ స్టేజ్ లో నే గట్టిగా ట్రై చేస్తున్నాడు రాజమౌలి. [embed]https://www.youtube.com/watch?v=msOqIaVhJx0[/embed]