Mahesh Babu: రాజమౌళి సినిమాల కోసం 10 ఏళ్లు.. కృష్ణుడిగా మహేశ్ బాబు..
రాజమౌలి మూడంటే మూడు మూవీలు తీశాక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ముందుగా మహేశ్ బాబుతో ప్లాన్ చేసిన సినిమా తీయబోతున్నాడు రాజమౌలి. ప్రజెంట్ తమిళనాడులో పుణ్యక్షేత్రాలన్నీ చుట్టేసి, డివోషనల్ బ్రేక్ లో ఉన్నాడు. ఇక డిసెంబర్ లో మహేశ్ బాబు మూవీ పనులు మొదలౌతాయి. ఆగస్ట్ 15 కి సినిమా తాలూకు ఎనౌన్స్ మెంట్ తో పాటు ప్రెస్ మీట్ ప్లానింగ్స్ జరుగుతున్నాయి.

Rajamouli will be seen in the getup of Superstar Krishna in Mahabharatham, which is being made in Mahesh Babu combination
ఐతే 2024 లో మహేశ్ బాబు సినిమాను మొదలుపెట్టి 2025 దీపావళికి మొదటి భాగం, 2026 దసరాకు రెండో భాగం రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అదే కాదు త్రిబుల్ ఆర్ సీక్వెల్ ప్లానింగ్స్ కూడా ఫిక్స్అయ్యాయని విజయేంద్రప్రసాద్ ఆల్రెడీ తేల్చాడు.
త్రిబుల్ ఆర్ 2 ని రాజమౌళికాని, లేదంటే తన పర్యవేక్షణలో హాలీవుడ్ టీం కాని తెరకెక్కిస్తుందన్నాడు. ఆతర్వాతే మహాభారతంని 4 భాగాలుగా తీస్తాడట. ఐదేళ్లలో 4 భాగాలు ప్లాన్ చేశాడట. అంటే మహేశ్ బాబు సినిమాకు 3ఏళ్లు, త్రిబుల్ ఆర్ రెండో భాగానికి 2 ఏళ్లు మహాభారతం కు 5 ఏళ్లు ఇలా మొత్తంగా పదేళ్ల ప్లానింగ్ తో ముందుకెళుతున్నాడు రాజమౌళి.