ఎన్టీఆర్, ప్రభాస్ దర్శకులుకు.. రాజమౌళి పాఠాలు…

దేవరతో కొరటాల శివ పాన్ ఇండియా లెవల్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆచార్య పంచ్ తో పడ్డ మచ్చను పాన్ ఇండియా హిట్ తో చెరిపేసుకున్నాడు. కట్ చేస్తే, సందీప్ రెడ్డి వంగ కూడా వంగతో ఆల్ మోస్ట్ వెయ్యికోట్ల వసూళ్లని కొల్ల గొట్టే ప్రయత్నం చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 17, 2024 | 04:44 PMLast Updated on: Nov 17, 2024 | 4:44 PM

Rajamoulis Lessons For Ntr And Prabhas Directors

దేవరతో కొరటాల శివ పాన్ ఇండియా లెవల్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆచార్య పంచ్ తో పడ్డ మచ్చను పాన్ ఇండియా హిట్ తో చెరిపేసుకున్నాడు. కట్ చేస్తే, సందీప్ రెడ్డి వంగ కూడా వంగతో ఆల్ మోస్ట్ వెయ్యికోట్ల వసూళ్లని కొల్ల గొట్టే ప్రయత్నం చేశాడు. ఐతే ఇప్పుడు ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ప్లాన్ చేస్తే, ఎన్టీఆర్ తో దేవర 2 ని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉణ్నాడు కొరటాల శివ. అంతకంటే ముందే డ్రాగన్ సెట్స్ పైకెళ్ళింది. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి షురూ కాబోతోంది. అయితే ఈమూడు సినిమాలు మొదలయ్యే లోపు పాన్ ఆసియా పాఠాలు నేర్చుకోబోతున్నారు. అది కూడా పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళి దగ్గరే… ఎందుకో చూసేయండి.

ఎన్టీఆర్ దేవర దుమ్ముదులిపాక, వార్ 2, తర్వాత డ్రాగన్ మూవీతో ఎన్టీఆర్ బిజీ అయ్యాడు. వార్ 2 షూటింగ్ పూర్తయ్యే స్టేజ్ లోఉంటే, డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కాబోతోంది. ఇలాంటి టైంలో ఇటు ప్రశాంత్ నీల్, డ్రాగన్ తర్వాత తెరకెక్కబోయే దేవర 2 కోసం కొరటాల శివ ఇద్దరూ రాజమౌళి దగ్గర పాఠాలు నేర్చుకోబోతున్నారట. వీళ్లే కాదు సందీప్ రెడ్డి వంగ కూడా స్పిరిట్ షూటింగ్ కి ముందే రాజమౌళి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకునే పనిలో ఉన్నాడు.

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమా తాలూకు, షూటింగ్ ఆమధ్య 40 శాతం పూర్తైంది. అంటే హీరో లేకుండానే, టోటల్ సినిమాలో 40 శాతం సీన్లను ముందే షూట్ చేసి, దాన్ని మీద విజువల్ ఎఫెక్ట్స్ అప్లై చేసి, ఆతర్వాత అసలు హీరో తో షూట్ చేస్తారు

అలా ముందే గ్రాఫిక్ వర్క్ పూర్తి చేసిన, ఆ విజువల్స్ ని కెమెరాకి కనెక్ట్ చేసి సినిమా తీయటం, సింపుల్ గా చెప్పాలంటే ఇది అవతార్ టెక్నిక్… దాన్నే రాజమౌళి నేర్చుకుని మహేశ్ బాబు మూవీకి అప్లై చేస్తున్నాడు

ఆవిషయంలోనే ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, కొరటాల శివకి తన అనుభవాన్ని పంచబోతున్నాడు. దేవర 2కి, స్పిరిట్, డ్రాగన్ సినిమాలకు కూడా ఇదే టెక్నాలజీని వాడబోతున్నారట. కాబట్టి, రాజమౌళి అనుభవం వీళ్లకు కూడా పనికొస్తుంది. అందుకే జక్కన్న వీళ్లకి తన సినిమా షూటింగ్ టైంలో సెట్లో జాయిన్ అయ్యేందుకు ఇన్విటేషన్ కూడా ఇచ్చాడట

గతంలో ఓ ఇంటర్వూ చేస్తున్నప్పుడు రాజమౌళి షూటింగ్ చేస్తుంటే, కనీసం ఓ ఇరవై రోజులైనా దగ్గరుండి షూటింగ్ చూడాలనేది సందీప్ రెడ్డి వంగ కోరాడు.. రాజమౌళి కూడా ఓకే అనేశాడు. ఐతే సందీప్ రెడ్డి వంగతో పాటు, కొరటాల శివ, ప్రశాంత్ నీల్ కూడా మహేశ్ మూవీ షూటింగ్ టైంలో రాజమౌళితో జాయిన్ కాబోతున్నారు. షూటింగ్ కి ముందే పూర్తి చేసిన విజువల్ ఎఫెక్ట్స్ ని సెట్లో షూట్ చేసేప్పుడు ఎలా అప్లై చేయాలనేదాని మీద వీల్లంత కలిసి పనిచేయబోతున్నారు. అంటే దేవర 2, స్పిరిట్, డ్రాగన్ లో గ్రాఫిక్స్ అవతార్ రేంజ్ లో ఉండే ఛాన్స్ఉందని తేలిపోయింది.. దీంతో అంచానాల భారం పెరిగే ఛాన్స్ ఉంది.