SS Rajamouli, SSMB29 : ఇదే బ్యాక్‌డ్రాప్‌లో రాజమౌళి మూవీ.. నవల ఆధారంగా SSMB29 ..!

మహేష్ (Mahesh) , రాజమౌళి (SS Rajamouli) కాంబో పై ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆర్ఆర్ఆర్‌తో రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లిపోవడంతో.. మహేష్ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. పైగా ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్‌గా, ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. అందుకే ఒక్క మహేష్ ఫ్యాన్సే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ రావడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 01:46 PMLast Updated on: Nov 16, 2023 | 1:46 PM

Rajamoulis Movie In The Same Backdrop Ssmb29 Based On The Novel

మహేష్ (Mahesh) , రాజమౌళి (SS Rajamouli) కాంబో పై ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆర్ఆర్ఆర్‌తో రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లిపోవడంతో.. మహేష్ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. పైగా ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్‌గా, ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. అందుకే ఒక్క మహేష్ ఫ్యాన్సే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం.. ఫలానా టైంలో ఎస్ఎస్ఎంబీ 29 గ్రాండ్‌గా లాంచ్ కానుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Bigg Boss 7 : అర్జున్ చేతికి ఎవిక్షన్ ఫ్రీ పాస్.. కానీ అంతలోనే.. ట్విస్ట్ మీద ట్విస్ట్ ..?

ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ ఒకటిగా ఉండటంతో ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఫలానా హీరోయిన్‌ను అనుకుంటున్నారని.. విలన్‌గా ఓ స్టార్ హీరోని తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్టోరీ అండ్ క్యాస్టింగ్ గురించి ఏదో ఓ పుకారు షికారు చేస్తునే ఉంది. . ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. లొకేషన్లు ఫైనల్ చేయడంలో, విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ బోర్డులు సిద్ధం చేయడం లాంటివి జక్కన్న పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ విదేశాల్లోనే జరగనుందన్న నేపథ్యంలోనే.. ఓ పవర్ ఫుల్ రూమర్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎగ్జైటింగ్‌గా మారింది.

సూపర్‌స్టార్‌ మహేష్‌ కాంబినేషన్‌లో రాజమౌళి చేయబోయే సినిమా ఇండియానా జోన్స్‌ సిరీస్‌ తరహాలో ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అడ్వంచరస్‌ మూవీగా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ క‌థ‌ను ఎలా ద‌క్కించుకున్న దానిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ రచయిత విల్బర్ స్మిత్ `ది బాలంటైన్`నవలల ఆధారంగా స్క్రిప్టును మ‌లిచినట్లు తెలుస్తోంది. ఈ నవలల హక్కులను రాజమౌళి- కె.ఎల్ నారాయ‌ణ బృందం ఛేజిక్కించుకున్నారని టాక్ వినిపిస్తోంది. దాని ఆధారంగా చేసుకునే రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.