Rajanikanth Jailer: జైలర్ హిట్టా – ఫట్టా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఈగర్ గా ఎదురుగా చూసిన జైలర్ మూవీ థియేటర్లోకి వచ్చేసింది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ ల తర్వాత రజనీ మూవీ రావడంతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ అభిమానులను ఆకట్టుకుందా లేదా అన్న మేటర్ తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
జైలర్ చిత్ర కథ గురించి చెప్పాలంటే రిటైర్డ్ ఉద్యోగి అయిన రజనీకాంత్ ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ప్రశాంతంగా ఉన్న అతని జీవితాన్ని మాఫియా డిస్టర్బ్ చేస్తుంది. ఒకప్పటి ఈ జైలర్ తన కుటుంబం కోసం మాఫియాపై యుద్ధం మొదలుపెడతాడు. బడా మాఫియాతో వన్ మాన్ ఆర్మీ రజినీకాంత్ ఎలా పోరాడి గెలిచాడు అనేదే కథ.
పర్ఫామెన్స్ విషయానికి వస్తే రజినీకాంత్ ఎప్పటిలాగే దుమ్ము దులిపేశాడు. యాక్షన్ లో అద్దరగొట్టేసాడు. వన్ మ్యాన్ షోలో సినిమాను నడిపించాడు. రజిని మానియా, స్టైల్ ,ఆపీరియన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు న్యాయం చేశారు.టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. అనిరుథ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది.నెల్సన్ మార్క్ కామెడీ, హీరో క్యారెక్టరైజేషన్ మెప్పిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్,ట్విస్ట్ సైతం ఆకట్టుకుంటాయి. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రజనీ అభిమానులు ఏమి కోరుకున్నారో అన్ని సినిమాల్లో కనిపిస్తాయి . ఓవరాల్ గా ఈ చిత్రం రజనీ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. యాక్షన్ ఫీస్ట్ లా అనిపిస్తోంది.