పోస్టర్ కే పది మిలియన్లంటే… గ్లింప్సో టీజరో వస్తే సునామేనా..?

రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేసినా సెన్సేషనే... 2015 నుంచి ఇలానే జరుగుతోంది. 9 ఏళ్లుగా పాన్ ఇండియా కింగ్ గా దూసుకెళుతున్న తను, ఇప్పుడు పాన్ ఆసియా మార్కెట్ ని కూడా దాటి పాన్ వరల్డ్ మార్కెట్లోకి వెళుతున్నాడు. ఇలాంటి టైంలో ది రాజా సాబ్ బాంబు పేల్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2024 | 04:26 PMLast Updated on: Oct 26, 2024 | 4:26 PM

Rajasab Poster Record Views In Youtube

రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేసినా సెన్సేషనే… 2015 నుంచి ఇలానే జరుగుతోంది. 9 ఏళ్లుగా పాన్ ఇండియా కింగ్ గా దూసుకెళుతున్న తను, ఇప్పుడు పాన్ ఆసియా మార్కెట్ ని కూడా దాటి పాన్ వరల్డ్ మార్కెట్లోకి వెళుతున్నాడు. ఇలాంటి టైంలో ది రాజా సాబ్ బాంబు పేల్చాడు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా వచ్చే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 18 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. ఐతే మొన్నటికి మొన్న రెబల్ స్టార్ బర్త్ డే స్పెషల్ గా మోషన్ పోస్టర్ వచ్చింది. యానిమేషన్ లాంటి మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరలైంది. విడుదలైన 24 గంటల్లోనే పది మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే, అంతా షాక్ అవుతున్నారు. ఇది పాట కాదు..కనీసం లిరియల్ సాంగ్ ప్రోమో కాదు.. అంతకుమించి గ్లింప్సో లేదంటే డైలాగ్ పెట్టి వదిలే టీజరో కాదు… జస్ట్ మోషన్ పోస్టర్… అది కూడా లాస్ట్ లో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో ఉన్న ఇమేజ్ ఉంటుంది.. ఆమాత్రానికే 24 గంటల్లో పదిమిలియన్ల వ్యూసంటే, మార్కెట్ షేక్ అవుతోంది. ది రాజా సాబ్ 1350 కోట్ల ప్రీరిలీజ్ వెనక తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్ధమైపోతోంది.

ది రాజా సాబ్ మోషన్ పోస్టర్ ని రెబల్ స్టార్ బర్త్ డే స్పెషల్ గా వదిలిన, 24 గంట్లలో 10 మిలియన్ వ్యూస్ దానికే వచ్చాయి. ఇందులో పెద్దగా రాజా సాబ్ తాలూకు కంటెంట్ రివీల్ అయ్యిందిలేదు. కేవలం చివరాఖర్లో ప్రభాస్ డిఫరెంట్ లుక్ తో ఇచ్చిన షాకే కనిపిస్తుంది తప్ప, మరేంలేదు. అయినా 24 గంటల్లో ఈ మోషన్ పోస్టర్ కి 10 మిలియన్ వ్యూస్ అంటే అంతా షాక్ అవుతున్నారు

కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలని డైలాగ్, ఎందుకో పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ కి సూట్ అయ్యేలాఉంది. ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే, ఒక్క ఫోటో తప్ప ఏం లేని ది రాజా సాబ్ మోషన్ పోస్టర్ రిలీజ్ కాగానే, అది సోషల్ మీడియాలో వైరలైంది. ఓటీటీలో సలార్ స్ట్రీమింగ్ లోకి వచ్చి 250 రోజులు దాటినా కూడా ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలో ట్రెండింగ్ లోఉంది.

కల్కీ 1200 కోట్లు రాబట్టి నెలలు గడుస్తున్నా, ఇంకా దీని సీక్వెల్ మీద అంచనాలు, ప్రశ్నలంటూ చాలా వరకు ప్రతీ వారం ఏదో ఒక డిస్కర్షన్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది… ఇక ఫౌజీ మూవీ అయితే ఇంకా చిన్నా చితకా సీన్ల షూటింగ్ మాత్రమే జరిగినా, అప్పుడే ఆడియో రైట్స్ 150 కోట్ల డీల్ జరిగిందంటు వార్తలొస్తున్నాయి

ఇలా ప్రతీ వారం, లేదంటే ప్రతీ నెల ప్రభాస్ సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్లో హాట్ టాపిక్ అవుతోంది. తన బర్త్ డేకి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వట్లదని ఫౌజీ టీం తేలిస్తే, ఆ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ఇలా ప్రభాస్ కదిలితే, లేదంటే కదలకపోతే, ప్రతీదీ వార్తగా మారుతోంది..

అందుకే తన సినిమా పూర్తవ్వకముందే కాదు, అసలు షూటింగ్ జరక్క ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో వందలకోట్ల లెక్కలు దాటి వేల కోట్లుగా మారేలా ఉన్నాయి. దిరాజా సాబ్ అయితే విడుదలకు ముందే 1350కట్ల వరకు డీల్స్ సెట్ అయినట్టు తెలుస్తున్నాయి. సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్, సలార్, బాహుబలి, కల్కీ ఇలా అన్నీ డిఫరెంట్ జోనర్సే ట్రై చేసిన ప్రబాస్, ఇప్పటి వరకు సీరియస్ రోల్సే చేశాడు. కల్కీలో మాత్రం కాస్త నవ్వించాడు… ఐతే ఈ సారి భయపెడుతూనే భారీగా నవ్వించబోతున్నాడు, కాబట్టే ది రాజా సాబ్ తాలూకు ఏ అప్ డేట్ వచ్చినా వైరలయ్యేలా ఉంది. అస్సలు కంటెంట్ కాని, మరే అప్ డేట్ కాని లీక్ కాకుండా చుసూకుంటూ వచ్చారు కాబట్టే, ఫ్యాన్స్ తో పాటు మూవీలవర్స్ కూడా ఫోకస్ అంతా ఈ సినిమా మీద మరింత పెరిగినట్టుంది.