రజినీ, షారుఖ్ కి దమ్ములేదా..? 1000 కోట్ల వణుకు…
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి 1000 కోట్ల భయంపట్టుకుంది. రెండు సార్లంటే రెండు సార్లు పాన్ ఇండియాని 1000 కోట్ల వసూల్లతో షేక్ చేసిన షారుఖ్ ఖాన్ కి కూడా వెయ్యికోట్ల జ్వరం పెరిగినట్టుంది.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి 1000 కోట్ల భయంపట్టుకుంది. రెండు సార్లంటే రెండు సార్లు పాన్ ఇండియాని 1000 కోట్ల వసూల్లతో షేక్ చేసిన షారుఖ్ ఖాన్ కి కూడా వెయ్యికోట్ల జ్వరం పెరిగినట్టుంది. ఇద్దరికీ ఒకప్పటి లా ధైర్యం తగ్గిందో… లేదంటే వాళ్లకి దొరుకుతున్న సినిమాల కథల మీద నమ్మకం తగ్గిందో… మొత్తానికి 1000 కోట్ల వణుకు ఈ ఇద్దరికి మొదలైనట్టే కనిపిస్తోంది. కొత్తగా ఎవరు కథ చెప్పడానికి వెళ్లినా, చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారట. రజినీకాంత్ అయితే ఇవన్నీ ఎందుకని, కొత్త ప్రయోగాలకి పూర్తిగా గుడ్ బై చెప్పాడని తెలుస్తోంది. చిన్న దెబ్బ తగలగానే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా 1000 కోట్ల భయంతో, వెనకడుగే వేశాడని తెలుస్తోంది. ఇంతకి కోలీవుడ్ సూపర్ స్టార్ , బాలీవుడ్ బాద్ షా ఈ ఇద్దరిని భయపెడుతున్న ఆ వెయ్యికోట్ల నిజమేంటి? అందుకోసం వీళ్ళు తెలివిగా ప్లాన్ చేసుకున్న సేఫ్ గేమ్ కథేంటి? టేకేలుక్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ పటాన్ తో 1000 కోట్ల వసూళ్లు రాబట్టాడు. తర్వాత జవాన్ తో 1300 కోట్లు కొల్లగొట్టాడు. రెండు సార్లు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టి బాలీవుడ్ ని కాపాడాడు.. కాని ఇప్పడు తనని కాపాడే వాళ్ళెవరు లేక, రిస్క్ చేయనంటున్నాడు. 1000 కోట్ల భయంతో వెనకడుగు వేశాడు.. అసలు సంగతేంటంటే, పటాన్, జవాన్ తర్వాత తను డంకీ మూవీ తీస్తే450 కోట్ల్ పెట్టుబడి 550 కోట్ల రాబడిగా మారింది. సో పెద్దగా మూడో హిట్ తో తనకి కలిసొచ్చిందేం లేదు.అలాని తన దగ్గరికి వస్తున్న కథలు గొప్పగా ఉన్నాయా అంటే,అది కూడా లేదు. అందుకే 1000 కోట్ల వసూళ్లు రాబట్టే వేల, అనవసరపు ప్రయోగాలు చేస్తే, డంకీలా పంచ్ పడుతుంది. అందుకే రిస్క్ వద్దుని ఫిక్స్ అయ్యాడు. అందుకే బాలీవుడ్ తోపు ప్రొడక్షన్ హౌజ్ అయిన యష్ రాజ్ బ్యానర్ లో పటాన్ సీక్వెల్ కి సిద్దపడ్డాడు షారుఖ్.
ఆదిత్యా చోప్రా ఆల్రెడీ కత్తిలాంటి కథ సిద్దం చేశాడట. యష్ రాజ్ బ్యానర్ అదినేత అయిన ఆదిత్యచోప్రా కథ రాసి సినిమా చేద్దామన్నాక నో చెప్పే ధైర్యం షారుఖ్ కూడా చేయలేదు. ఎలాగూ తనదగ్గరకి కొత్త కథలు రావట్లేదు. రిస్క్ చేస్తే డంకీ లా పంచ్ పడే ఛాన్స్ఉంది కాబట్టి, 1000 కోట్ల పటాన్ కి సీక్వెల్ అంటే మరో సారి వెయ్యికోట్ల వసూళ్లు వచ్చే చాన్స్ ఉంది.అందుకే తను కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ లానే రిస్క్ కి దూరంగా వెల్లాలనుకుంటున్నాడట. జైలర్ తో హిట్ పడ్డాక రజినీకాంత్ ఏ ప్రయోగం చేసిన బెడిసి కొట్టింది. వెట్టయాన్ ఫ్లాపైంది, లాల్ సలామ్ కూడా డిజాస్టర్ అని తేలింది. అందుకే కొత్తవెందుకని, హిట్ మూవీ జైలర్ కి సీక్వెల్ చేస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తను చేస్తున్న కూలీ కూడా కొత్త కథేం కాదని తెలుస్తోంది
నైంటీస్ లో రజినీకాంత్ కి మాస్ హిట్స్ గా నిలిచిన మూవీల్లో స్టోరీ లైన్ బేస్ చేసుకునే కూలీ మూవీ తీస్తున్నాడు లోకేష్ కనకరాజ్. సో ఇంతవరకు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్ట లేకపోయిన రజినీకాంత్, ఆల్రెడీ రెండు సార్లు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టిన షారుక్ , ఇలా ఇద్దరూ రిస్క్ వద్దని, హిట్ మూవీలకి సీక్వెల్స్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.