Rajinikanth: మొరిగే కుక్కలు వాళ్లేనా..? రజినీకాంత్ తేల్చేశారా..?

జైలర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మొరిగే కుక్కలు మొరుగుతాయి. ఎవరేమన్నా మన పని మనం చేసుకుపోవాలి అన్నాడు. ఈ కామెంట్లో మొరిగే కుక్కలు ఎవరనే చర్చ మొదలైంది అంతటా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 10, 2023 | 07:08 PMLast Updated on: Aug 10, 2023 | 7:08 PM

Rajinikanth Confirmed That Who Is That Shouting Dog

Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలా తన మీద కామెంట్స్ చేసిన వాళ్లకి కౌంటర్ ఇచ్చేశారు. ఈ ఇద్దరూ ఒకే దారి ఎంచుకున్నట్టున్నారు. జైలర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మొరిగే కుక్కలు మొరుగుతాయి. ఎవరేమన్నా మన పని మనం చేసుకుపోవాలి అన్నాడు. ఈ కామెంట్లో మొరిగే కుక్కలు ఎవరనే చర్చ మొదలైంది అంతటా.

ఐతే ఆమధ్య బాలయ్య, చంద్రబాబు మీద ప్రశంసల వర్షం కురిపించినప్పుడు, కొందరు వైసీపీ నేతలు రజినీ మీద విరుచుకుపడ్డారు. వాళ్లనే ఉద్దేశించి రజినీ ఇలా జైలర్ ఈవెంట్‌లో కామెంట్ చేశాడనే పుకార్లు కూడా పెరిగాయి. అయితే అది లాంగ్ బ్యాక్ స్టోరీ కాబట్టి అది కారణం కాకపోవచ్చంటున్నారు మరికొందరు. ఇప్పుడు రజినీకి వయసైపోయింది. కాబట్టి ఆయన దిగిపోతే యంగ్ హీరో విజయ్ దళపతి తర్వాతి సూపర్ స్టార్ అంటామంటూ కొంతంమంది విజయ్ ఫ్యాన్స్ పేరుతో వెకిలి కామెంట్లు చేస్తున్నారట. సో వాళ్లను ఉద్దేశించే రజినీకాంత్ ఇలా మొరిగే కుక్కలన్నాడని మరో ప్రచారం జరుగుతోంది. రజినీ వ్యాఖ్యల విషయంలో ఈ ప్రచారం కొంతకాలం సాగుతూనే ఉంటుంది.