VIJAY DEVARAKONDA: ఇదెక్కడి శాడిజం.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మీద ట్రోలింగ్

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ రౌడీ స్టార్‌ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంటే జైలర్‌కి ముందొచ్చిన పెద్దన్న, దర్బార్.. ఇలా గత ఐదారు సినిమాలు ఫ్లాప్స్ అంటావా..? అందులో కొన్ని వసూల్లు దుమ్ములిపాయి, రెండు యావరేజ్‌గా ఆడాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 24, 2023 | 07:09 PMLast Updated on: Aug 24, 2023 | 7:09 PM

Rajinikanth Fans Angry On Vijay Devarakondas Comments Rowdy Fans Hits Back

VIJAY DEVARAKONDA: విజయ్ దేవరకొండ మొన్న ఖుషీ తమిళ ప్రమోషన్‌లో భాగంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పటమే తప్పైంది. “జైలర్ దూసుకెళుతోంది. మరి భోళాశంకర్ పరిస్థితి ఏంటి” అనడిగారు. దీనికి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “రజినీకాంత్, చిరంజీవి లాంటి పెద్ద స్టార్లు హిట్లు, ఫెయిల్యూర్స్‌కి అతీతులు. ఐదారు ఫ్లాపులు పడ్డా సింగిల్ హిట్ రాగానే వాళ్లకి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే” అనే అర్ధం వచ్చేలా చెప్పాడు.

దీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ రౌడీ స్టార్‌ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంటే జైలర్‌కి ముందొచ్చిన పెద్దన్న, దర్బార్.. ఇలా గత ఐదారు సినిమాలు ఫ్లాప్స్ అంటావా..? అందులో కొన్ని వసూల్లు దుమ్ములిపాయి, రెండు యావరేజ్‌గా ఆడాయి. అయినా అవి ఫ్లాప్స్ అనటానికి నువ్వెవరంటూ రజినీ ఫ్యాన్స్ రౌడీ స్టార్‌ని టార్గెట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో కరెక్టే అన్నాడంటున్నారు. చిరు, రజినీలాంటి స్టార్స్ ఐదారు ఫెయిల్యూర్స్ వచ్చినా సింగల్ హిట్‌తో దుమ్ముదులిపే సత్తా ఉందన్న మాటలో తప్పేముందని నిలదీస్తున్నారు.

రజినీ చిత్రాలు ప్లాప్ అయ్యాయని విజయ్ అనలేదని, ఐదారు సినిమాలు ప్లాపైనా తట్టుకునే ఇమేజ్, క్రేజ్ ఆ బడా స్టార్లదని అన్నాడని, తన ఇంగ్లీష్‌ని తమిళ తంబీలు సరిగా అర్ధం చేసుకోలేదంటూ, క్లాస్ తీసుకుంటున్నారు రౌడీ ఫ్యాన్స్.