Rajinikanth, Jailer 2 : మరోసారి టైగర్ కా హుకుం.. ( జైలర్-2 )
రజనీకాంత్ ప్రస్తుతం లాల్ సలాం ని రిలీజ్ కి రెడీ చేస్తునే మరో రెండు ప్రాజెక్ట్స్ కి ఒకే చెప్పాడు. ఇందులో ఒకదాన్ని టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తుంటే మరో ప్రాజెక్ట్ ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. విటితో పాటే జైలర్ సీక్వెల్ ని కూడా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట రజనీ.

Rajinikanth is currently preparing Lal Salaam for the release of two other projects One of these is being directed by TJ Gnanavel while the other project will be directed by Lokesh Kanagaraj
మరోసారి టైగర్ కా హుకుం..
ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. హిట్ అయిన సినిమాకి సీక్వెల్ చేయడం హాబీగా మారింది. మొన్నటి వరకు నార్త్ కే పరిమితమైన ఈ ఫార్ములా ఇప్పుడు సౌత్ కి అంటుకుంది. జైలర్ తో హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు సీక్వెల్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. ఆగస్టు 10న విడుదలైన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. వింటేజ్ రజినీకాంత్ ని చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. తలైవా స్టైల్, స్వాగ్, యాక్షన్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దీంతో ఈ సినిమా లాంగ్ రన్ లో 700 కోట్లు వసూలు చేసింది. విడుదలకు ముందే సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసిన మేకర్స్ తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ కి 55 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ ప్రస్తుతం లాల్ సలాం ని రిలీజ్ కి రెడీ చేస్తునే మరో రెండు ప్రాజెక్ట్స్ కి ఒకే చెప్పాడు. ఇందులో ఒకదాన్ని టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తుంటే మరో ప్రాజెక్ట్ ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. విటితో పాటే జైలర్ సీక్వెల్ ని కూడా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట రజనీ. ఫస్ట్ పార్ట్ కి మ్యూజిక్ అందించిన అనిరుధ్ సీక్వెల్ కి కూడా వర్క్ చేయబోతున్నాడు. మొత్తానికి జైలర్ లో రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజ్ లో పెలింది. దీంతో సీక్వెల్ లో సూపర్ స్టార్ ఎలా కనిపిస్తారు అనే క్యూరియాసిటీ ఎక్కువైంది. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.