Chiranjeevi: ఒక్క చిరంజీవి తప్ప ఓల్డ్ హీరోలంతా దూసుకెళ్లిపోతున్నారు

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సూపర్ సీనియర్ హీరోస్ అంతా ఫుల్ బిజీగా ఉన్నారు. 60 ప్లస్ లోనూ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు.. బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోలకే గట్టి పోటీ ఇస్తున్నారు. కొందరు బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంటే, మరికొందరు ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 23, 2023 | 09:16 AMLast Updated on: Aug 23, 2023 | 9:16 AM

Rajinikanth Kamal Haasan Mohanlal Shivraj Kumar And Sunny Deol Are All Making Box Office Hits At The Age Of 60

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సూపర్ సీనియర్ హీరోస్ అంతా ఫుల్ బిజీగా ఉన్నారు. 60 ప్లస్ లోనూ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు.. బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోలకే గట్టి పోటీ ఇస్తున్నారు. కొందరు బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంటే, మరికొందరు ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాస్తున్నారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ వయసు 72 సంవత్సరాలు. ఈ వయస్సులో కూడా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు తలైవా. చాలా కాలం తర్వాత ‘జైలర్’ తో సాలిడ్ హిట్ కొట్టారు. 11 రోజుల్లోనే 550 కోట్ల గ్రాస్ ని రాబట్టగలిగింది ఈ సినిమా.  ఓవర్ సీస్ లో ఈ సినిమా 20 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసి రజినీ స్టార్ డం ఏంటో మరోసారి రూచి చూపించింది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 69 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

విశ్వనటుడు కమల్ హాసన్ 68 ఏళ్ల వయసులో ‘విక్రమ్’ మూవీ చేసి ట్రెండ్ బెండ్ తీశాడు. వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, ఫహాద్ పాజిల్ కీలక పాత్రల్లో కనిపించారు. ప్రజెంట్ శంకర్ డైరెక్షన్ లో ‘ఇండియన్ 2’ చేస్తున్న కమల్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898AD లో విలన్ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 71 ఏళ్ల వయసులో ‘భీష్మ పర్వం’ చేసి ఘన విజయం సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత వచ్చిన ‘పుజు’, ‘రోర్స్చాచ్’ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం ‘కడుగన్నవా ఒరు యాత్ర’, ‘కథల్ ది కోర్’ ‘కన్నూర్ స్క్వాడ్’ సినిమాల్లో నటిస్తున్నాడు మమ్ముట్టి. ఇటీవలే ‘బజుకా’ అనే పాన్ ఇండియా సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లింది.

మోహన్ లాల్ ఇటీవల కాలంలో ఓటీటీలో కూడా సక్సెస్ అయ్యాడు కానీ, థియేట్రికల్ గా హిట్టు కొట్టకలేకపోయాడు. ప్రస్తుతం తన చేతిలో 6 సినిమాలు ఉన్నాయి. త్వరలో ‘లూసిఫర్ 2’ సెట్స్ పైకి వెళ్లనుంది. 62 ఏళ్ల వయసులో మోహన్ లాల్ ఈ రెంజ్ లో సినిమాలు చేస్తుడటం యంగ్ హీరోలకే షాక్ ఇస్తోంది.

కన్నడ హీరో శివ రాజ్ కుమార్ కూడా 61 ఏళ్ల వయసులో వరుస విజయాలు అందుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన భజరంగి 2, బైరాగీ, వేద సినిమాలు కమర్షియల్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో చిన్న పాత్రలో మెరిశారు. దసరాకి ‘ఘోస్ట్’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నాడు.

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ 65 ఏళ్ల వయసులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ‘గదర్ 2’తో నార్త్ బాక్సాఫీస్ కి పూర్వ వైభవం తీసుకొచ్చాడు. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటి వరకు 376 కోట్లు వసూళ్లు చేసింది. లాంగ్ రన్ లో 500 కోట్లు వసూళ్లు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి 60ఏళ్ల పైబడిన సూపర్ సీనియర్ హీరోలంతా ఫుల్ బిజీగా వున్నారు. యేడాది పొడవునా సినిమాలు చేస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ‘లెజెండ్స్ ఫర్ ఎవర్’ అని నిరూపిస్తున్నారు