Rajinikanth: రజనీ వ్యవహారంలో మోహన్‌బాబు సైలెన్స్.. దోస్తీ అంటే ఇదేనా సారూ..
మనం ఒకరిని నిజంగా ఇష్టపడితే.. వాళ్ల తప్పులను కూడా ఇష్టపడాలి. లేదంటే ఇష్టపడడం లేదని ఒప్పుకోవాలి. అదే నిజమైన స్నేహం కూడా ! మన అనుకున్న వాళ్లు తప్పు లేదని తెలిసినా.. అందులో ఇబ్బంది పడుతున్న వ్యక్తి నుంచి తప్పించుకు తిరిగితే.. స్నేహానికి ఇంకేం విలువ ఉంటుంది. మోహన్‌బాబును చూసి టాలీవుడ్ అంతా అంటోంది ఇదే ఇప్పుడు ! మోహన్‌బాబు, రజనీకాంత్ చాలా థిక్ ఫ్రెండ్స్. రజనీ ఎప్పుడూ తమ స్నేహం స్థాయి ఇదీ అని ప్రత్యేకంగా చెప్పుకోకపోయినా.. బిల్డప్ కోసమో, గుర్తు చేయడం కోసమో కానీ.. ఆ స్నేహాన్ని ప్రతీసారి గుర్తు చేస్తుంటాడు మోహన్ బాబు.
రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దో కూడా తనను సలహాలు అడిగాడని చెప్పుకొచ్చాడు ఆ మధ్య ! ఇద్దరు ఫ్రెండ్స్ అని ప్రపంచం అంతటికీ తెలిసినా.. నిజంగా ఇంత మంచి ఫ్రెండ్సా కాదా అన్నది మాత్రం ఇంకా అనుమానమే.! అలాంటి అనుమానాలు.. ఇప్పుడో ఘటనతో మరింత బలంగా వినిపిస్తున్నాయ్. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు విజయవాడ వచ్చారు రజనీ. కావాలని అన్నారో.. వాళ్లు అనమని చెప్తే అన్నారో.. నిజంగా అభిమానంతో అన్నారో తెలియదు కానీ.. చంద్రబాబు, ఎన్టీఆర్ మీద ప్రశంసలు గుప్పించి వెళ్లాడు రజనీ.
తలైవర్ ఇలా వెళ్లారో లేదో.. వైసీపీ నేతలు అందుకున్నారు చూడండి ! బూతుల్లా వినిపించని బూతులు తిట్టడం మొదలుపెట్టారు. బూతు కథలు అల్లడం మొదలుపెట్టారు. ఇప్పడయితే ఏకంగా సిల్క్ స్మిత చావుకే.. రజనీ కారణం అంటూ కొత్త రాగం అందుకున్నారు సోషల్ మీడియాలో ! పాపం.. అతిధిగా వచ్చిన వ్యక్తిని ఇన్ని మాటలు అంటారా అని.. జాలేస్తోంది ఇదంతా చూస్తున్నవాళ్లకు ! రజనీకి చంద్రబాబు ఫోన్ చేసి.. చాలాసేపు బాధపడ్డారట పాపం. అనవసరంగా పిలిచామేమో అన్నట్లుగా ఓ ఎక్స్‌ప్రెషన్ కూడా ఇచ్చారట. ఇక అభిమానులు అయితే.. రజనీకి మద్దతుగా వైసీపీ నేతలు ఆడుకుంటున్నారు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతుంటే.. జాన్ జిగ్రీ, క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకునే మోహన్‌బాబు మాత్రం కనీసం పెదవి విప్పడం లేదు అదేంటో ! బాగున్నప్పుడు బంధాల గురించి మాట్లాడి.. బాగోలేనప్పుడు ఏం మాట్లాడకుండా ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదు మోహన్‌బాబు జీ అని తమిళ్‌లో సలహాలు ఇస్తున్నారు కొందరు. వైసీపీ అధినేత, సీఎం జగన్.. మోహన్‌బాబు చాలా దగ్గరి వరుస. జగన్ సోదరినే మోహన్‌బాబు కొడుకు పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం గుర్తొచ్చి మోహన్‌బాబు మాట్లాడడం లేదా.. లేదంటే భయం అడ్డొస్తుందా.. పాపం రజనీని అన్ని మాటలు అంటుంటే.. కనీసం ఒక్క మాట కూడా సపోర్టుగా అనాలనిపించలేదా మోహన్‌బాబు. మోహన్‌బాబు గారు ఒక్క మాట గుర్తుంచుకోండి.. A relationship between Friends must be like Fish and Water. but not like the fish and fishermen. అర్థం కాలేదనుకున్నా.. అర్థం లేదనుకున్నా.. ఏదో ఒకటి ఫ్రెండ్ కోసం మాట్లాడండి అంటూ పోస్టులు పెడుతున్నారు తలైవర్ ఫ్యాన్స్.