Rajinikanth: రజనీకాంత్‌కి చంద్రబాబు సన్మానం.. ఏం మాట్లాడుకున్నారంటే?
విజయవాడకు చేరుకున్న రజనీకాంత్ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రజనీకాంత్‌ను చంద్రబాబు నివాసానికి బాలకృష్ణ స్వయంగా తీసుకెళ్లారు.

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ఏపీకి వచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చారు. విజయవాడ విమానాశ్రయానికి వచ్చిన రజనీకాంత్‌కు.. హీరో నందమూరి బాలకృష్ణ ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ విజయవాడకు చేరుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యుల ఆహ్వానం మేరకు.. ఆయన విజయవాడకు వచ్చారు.
విజయవాడకు చేరుకున్న రజనీకాంత్ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రజనీకాంత్‌ను చంద్రబాబు నివాసానికి బాలకృష్ణ స్వయంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు, రజనీకాంత్ ఇద్దరూ పరస్పరం యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణతో కలిసి తాజా పరిస్ధితులపై మాట్లాడుకున్నారు. రజనీని శాలువా కప్పి సన్మానించించిన చంద్రబాబు.. పుష్పగుచ్చం అందించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ ముగ్గురూ కలిసి వెళ్తారు.
అక్కడ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు. గతంలోనూ పలుసార్లు చంద్రబాబు, రజనీకాంత్ భేటీ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి మాత్రం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు చంద్రబాబు, బాలకృష్ణ స్వయంగా ఆయన్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో రజనీ కూడా సంతోషంగా వచ్చేందుకు అంగీకరించారు.