Rajinikanth: కొడుకులు దిద్దిన కాపురం.. రజినీకాంత్ కూతురి వింత కథ..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు, హీరో ధనుష్ ఇద్దరు విడిపోయి ఏడాది అవుతోంది. ఐశ్వర్యా రజినీకాంత్ పిల్లల్ని చూసుకుంటూనే, మరో వైపు తండ్రి రజినీ కాంత్ తో లాల్ సలామ్ మూవీతీస్తోంది.. ఈలోపు తన ఇద్దరు కొడుకులు తమ తల్లి దండ్రుల కాపురాన్ని దిద్దేస్తున్నారట.

Rajinikanth's daughter Aishwarya married hero Dhanush and divorced now she wants to get married again for children
ధనుష్, ఐశ్వర్యా రజినీకాంత్ ఇద్దరూ విడిపోయాక, మళ్లీ పెళ్లితో ఒకటయ్యేలా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. నిజానికి రజినీకాంత్ కోరిక కూడా ఇదే అని గతంతో ఫ్యామిలీ కౌన్సిలింగ్ టైంలో చెప్పాడట.. ఏదైతేనేం, సూపర్ స్టార్ తాత కోరికను మనవళ్లైన ధనుష్ పిల్లలు యాత్ర, లింగా ఇద్దరు నిజం చేస్తున్నారు
ధనుష్, ఐశ్వర్యకి కొడుకులైన యాత్ర, లింగ ఇద్దరూ తమ తల్లి దండ్రులతో ఇప్పటికే ఐదారు సార్లు చర్చించారని, ఇద్దరినీ కలిపేందుకు చాలా సార్లు ప్రయత్నించారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వాళ్ల కృషి వల్ల తిరిగి ధనుష్, ఐశ్వర్య కలవబోతున్నారని తెలుస్తోంది. లాల్ సలామ్ మూవీ తర్వాతే వీళ్లు మళ్లీ పెళ్లితో ఒకటయ్యే ఛాన్స్ ఉందట. అలాంటి ప్రణాళికలు వేసుకున్నారని, ఈలోపు మనసు మారకుండా ఉండేందుకు వీళ్ల పిల్లలిద్దరు, ఒకరు తండ్రి దగ్గర మరొకరు తల్లిదగ్గర ఉండబోతున్నారట.