Rajanikanth: మా నాన్న తో సినిమా తీసి హిట్ కొడతా.. ఐశ్వర్య ఛాలెంజ్
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తెరకెక్కించబోయే చిత్రంలో రజనీకాంత్ ప్రత్యేక పాత్రలోకనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Rajinikanth's daughter Aishwarya seems to have given her father an amazing role in her next movie
జైలర్ హిట్‌తో రజనీ కూతురు ఫుల్ ఖుషీగా వుంది. తండ్రి సినిమా హిట్ అయితే కూతురు హ్యాపీ వుండడంలో కొత్తే ముందనుకోవచ్చు. రజనీ పెద్ద కూతురు ఐశ్వర్యకు జైలర్ కలిసొచ్చింది. ఎందుకంటే.. సూపర్‌స్టార్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఈ అమ్మడే కాబట్టి. రజనీ వారసురాలు ఐశ్వర్య కూడా డైరెక్టరే. 11 ఏళ్ల క్రితం ‘3’ అనే సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైంది. సినిమాలోని కోలావెరి సాంగ్ సూపర్‌హిట్ అయి.. టాప్ ఆల్బమ్‌గా నిలిచినా.. సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. ఈ దెబ్బకు దశాబ్దంపాటు మెగాఫోన్‌కు దూరంగా వుంటూ..రజనీ ఆశీస్సులతో ‘లాల్‌సలామ్’ మూవీ డైరెక్ట్ చేస్తోంది.
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా లాల్ సలామ్’ రూపొందుతోంది. ముఖ్యపాత్రలో రజనీకాంత్ మెరుస్తున్నాడు. జైలర్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు రజనీకాంత్. గెస్ట్ అపీరియన్స్ అని.. కాదు ముఖ్యపాత్రలో ఓ అరగంటసేపు కనిపిస్తాడన్న టాక్ నడుస్తోంది. అయితే.. సూపర్‌స్టార్ సెకండాఫ్ మొత్తం కనిపిస్తాడట. ఈలెక్కన జైలర్ వంటి అదిరిపోయే హిట్ తర్వాత వస్తున్న సినిమా ఎలా వున్నా.. భారీ ఓపెనింగ్స్ అయితే గ్యారెంటీ.
డైరెక్టర్‌గా పనితనేమిటో నిరూపించుకోవాలనుకున్న ఐశ్వర్యకు జైలర్ సక్సెస్ కలిసొచ్చింది. జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 527 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమాను 112 కోట్లకు అమ్మితే.. 258 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తోంది. అంటే 146 కోట్ల లాభం వచ్చింది. తెలుగు ప్రొడ్యూసర్స్‌కు 30 కోట్ల ప్రాఫిట్. తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను దిల్ రాజు.. ఏషియన్ మూవీస్ 12 కోట్లకు తీసుకుంటే.. 42 కోట్లు తీసుకొచ్చింది.